మనుషుల అసలు స్వభావం ఇలా తెలుసుకోండి
ABN , Publish Date - Apr 14 , 2026 | 03:16 PM
శత్రువులు ఎక్కడో ఉండరు ఆత్మీయుల్లా నటిస్తూ మన పక్కనే ఉంటారు. వారి మనసులో ఏముందో తెలుసుకోవడం కష్టం. అయితే, ఆచార్య చాణక్యుడు చెప్పిన కొన్ని సూచనలు మనుషుల అసలు స్వభావాన్ని అర్థం చేసుకోవడంలో సహాయపడతాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఈ రోజుల్లో నిజంగా మనవాళ్లు ఎవరో, నటిస్తున్నవాళ్లు ఎవరో గుర్తించడం కష్టం. చాలా సార్లు మనం నమ్మినవాళ్లే మనకు ద్రోహం చేస్తారు. అయితే, ఆచార్య చాణక్యుడు చాలా కాలం క్రితమే మనుషుల అసలు స్వభావాన్ని తెలుసుకునే కొన్ని సులభమైన మార్గాలు చెప్పారు. వారి మాటలు, ప్రవర్తనను గమనిస్తే వారి మనసును ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
అతిగా పొగడేవారిపై జాగ్రత్త:
ఎలాంటి కారణం లేకుండా మిమ్మల్ని అతిగా పొగిడే వారితో జాగ్రత్తగా ఉండాలి. చాలా సందర్భాల్లో వారు తమ ప్రయోజనాల కోసం ఇలా చేస్తారు. మీరు చెప్పే ప్రతిదానికీ అంగీకరిస్తే, అది నిజమైన అభిమానం కాకపోవచ్చు.
నిస్వార్థతను గుర్తించండి:
ఒకరి నిజమైన స్వభావం తెలుసుకోవాలంటే, వారు మీ కోసం ఎంతవరకు నిలబడతారో చూడాలి. తమ ప్రయోజనం కోసం మాత్రమే ఉండేవారు నిజమైన స్నేహితులు కాదు.
కష్ట సమయంలో ప్రవర్తన:
మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు మీతో ఉంటారో గమనించాలి. సంతోషంలో దగ్గరగా ఉండి, కష్టాల్లో దూరమయ్యే వారు నిజమైన ఆత్మీయులు కాదు.
ఇతరుల గురించి మాట్లాడే విధానం:
మీ ముందే ఇతరుల గురించి చెడుగా మాట్లాడేవారు, మీ గురించి కూడా ఇతరుల ముందు అలాగే మాట్లాడే అవకాశం ఉంటుంది. అలాంటి వారిపై నమ్మకం పెట్టుకోవద్దు.
కళ్ళు, మాటల ద్వారా తెలుసుకోవడం:
మనిషి కళ్లు చాలా విషయాలు చెబుతాయి. మాట్లాడేటప్పుడు కళ్లలోకి చూడకుండా తప్పించుకుంటే, వారు ఏదో దాచిపెడుతున్నారని అర్థం. అబద్ధం చెప్పేవారి మాటల్లో, ముఖంలో కూడా అనుమానం కనిపిస్తుంది. ఈ చిన్న విషయాలను గమనిస్తే, మనుషుల అసలు స్వభావాన్ని అర్థం చేసుకోవచ్చు. దీంతో మీరు మోసపోకుండా, మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
ఈ అపోహలు నమ్మితే బరువు తగ్గడం కష్టం
సమ్మర్‌లో రోజూ షూ వేసుకుంటున్నారా?
For More Latest News