Share News

చాణక్య నీతి.. ఈ సూత్రాలు పాటిస్తే వ్యాపారంలో లాభాలే లాభాలు

ABN , Publish Date - Oct 15 , 2026 | 08:30 AM

వ్యాపార రంగంలో విజయం సాధించడానికి ఆచార్య చాణక్యుడు కొన్ని సూత్రాలను సూచించారు. వ్యాపారులకు ఆయన చెబుతున్న విలువైన పాఠాలు ఏంటో చూద్దామా..

చాణక్య నీతి.. ఈ సూత్రాలు పాటిస్తే వ్యాపారంలో లాభాలే లాభాలు
Chanakya Niti

ఇంటర్నెట్ డెస్క్: కొందరు ఎంత ప్రయత్నించినా వ్యాపారంలో విఫలమవుతూ ఉంటారు. అంతా బాగానే చేస్తున్న ఎందుకు సక్సెస్ రావడం లేదని తలపట్టుకుంటారు. అయితే ఇలాంటి వారి కోసం ఆచార్య చాణక్యుడు కొన్ని సూత్రాలను బోధించారు. వీటిని శ్రద్ధగా పాటిస్తే వ్యాపారాన్ని విజయవంతం చేయొచ్చని ఆయన సూచించారు. వ్యాపారంలో చేయకూడని తప్పులను వివరించారు. వ్యాపారులకు చాణక్య నీతి చెబుతున్న విలువైన పాఠాలు ఏంటో చూద్దామా..


ప్రణాళికల విషయంలో జాగ్రత్త

తన వ్యాపార ప్రణాళికలను యజమాని ఇతరులతో పంచుకోకూడదు. ఆ ప్రణాళిక పూర్తిగా ఆచరణలోకి వచ్చే వరకూ దాన్ని రహస్యంగా ఉంచాలని చాణక్య నీతి సూచిస్తోంది. విలువైన ప్రణాళికలను రూపొందించడం ఎంత ముఖ్యమో వాటిని రహస్యంగా ఉంచడం అంతే ముఖ్యం.

ఎవరు నమ్మకస్థులు..?

వ్యాపారాన్ని విజయవంతంగా నడిపించాలంటే నమ్మకస్థులైన భాగస్వాములను ఎంచుకోవాలి. అయితే ఈ ప్రక్రియ అంత సులభమైంది కాదు. నమ్మదగిన, నిజాయితీ కలిగిన వ్యక్తిని వెతకడం కష్టమైన పని. అందుకే ఆలోచించి నమ్మకస్థులు ఎవరనేది తెలుసుకోవాలి.

కొన్నిసార్లు కఠినంగా ఉండడం అనివార్యం

వ్యాపారంలో సున్నిత స్వభావం అన్నివేళలా మంచిది కాదు. కొన్ని సార్లు కఠినంగా ఉండడం అనివార్యం అవుతుంది. అలాంటి సందర్భాల్లో కఠినంగానే ఉండాలి. పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించడానికి అలవాటు పడాలి.


నేర్చుకోవడం నిరంతర ప్రక్రియ

వ్యాపారులు రోజూ కొత్త విషయాలు నేర్చుకోవాలి. ఈ ప్రక్రియ ద్వారా వ్యాపారంలో మెళకువలు తెలుసుకోవచ్చని చాణక్య నీతి చెబుతోంది. ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండడం అత్యంత కీలకమని సూచిస్తోంది.

ధైర్యే సాహసే లక్ష్మి

వ్యాపారంలో లాభాలు రావాలంటే ధైర్య సాహసాలు ప్రదర్శించాలని చాణక్యుడు తెలిపారు. వ్యాపారంలోని పరాజయాలు, ప్రమాదాల నుంచి తప్పించుకోవడానికి ధైర్యం ఉండి తీరాలని ఆయన స్పష్టం చేశారు. అప్రమత్తత అనేది వ్యాపారవేత్తలకు కచ్చితంగా ఉండాల్సిన లక్షణమని వివరించారు. ఆపదల సమయంలో భయంతో కాకుండా ధైర్యంతో నిర్ణయాలు తీసుకునేవారిని విజయం వరిస్తుందని బోధించారు.


ఇవీ చదవండి

చాణక్య నీతి: ప్రశాంతంగా ఉండాలంటే.. ఇలాంటి వారికి దూరంగా ఉండాల్సిందే!

చాణక్య నీతి: జీవితంలో అసలైన స్నేహితులు వీరే..

Updated Date - Oct 15 , 2026 | 08:36 AM