23 చోట్ల ఎన్నికలకు బ్రేక్
ABN , Publish Date - Oct 15 , 2026 | 05:50 AM
రాష్ట్రంలో 4 మున్సిపల్ కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలకు ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించడం లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ప్రకటించింది.
కోర్టు కేసులతో ఓటర్ల జాబితా, వార్డు డీలిమిటేషన్ ఆలస్యం వల్లే: ఎస్ఈసీ
4 కార్పొరేషన్లు.. 19 మున్సిపాలిటీలకు ఆ తర్వాత షెడ్యూల్ విడుదల
అమరావతి, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 4 మున్సిపల్ కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలకు ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించడం లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ప్రకటించింది. కోర్టు కేసుల కారణంగా శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, కాకినాడ, మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్లకు.. ఆమదాలవలస, రాజాం, పాలకొల్లు, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, గుడివాడ, తాడిగడప, పొన్నూరు, నరసరావుపేట, బాపట్ల, కందుకూరు, పొదిలి, కావలి, గూడూరు, అల్లూరు, శ్రీకాళహస్తి మున్సిపాలిటీలు, చింతలపూడి, బి.కొత్తకోట నగర పంచాయతీల్లో ఎన్నికలకు అవకాశం లేదని తెలిపింది.
బుధవారం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. ఈ 23 చోట్ల తప్ప మిగిలిన 13 కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు/నగర పంచాయతీల్లో మాత్రమే ఎన్నికలు జరుగుతాయి. పై 23 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు సంబంధించిన వివాదాలు కోర్టుల్లో ఉన్నాయి. ఆయా స్థానాల్లో ఓటర్ల జాబితాల తయారీ, వార్డుల డీలిమిటేషన్ ప్రక్రియ ఇప్పటి వరకూ పూర్తి కాలేదు. ప్రస్తుతం ఆయా జిల్లాల యంత్రాంగాలు వార్డుల డీలిమిటేషన్తో పాటు ఎన్నికల ప్రక్రియకు సంబంధించి పనుల్లో నిమగ్నమై ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ 23 ప్రాంతాలకు మరోసారి షెడ్యూల్ విడుదల చేసి ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్ఈసీ వెల్లడించింది.
ఈ వార్తలనూ చదవండి:
ఆటోమేటిక్ వర్క్ పర్మిట్ ఎక్స్టెన్షన్ రద్దు.. అమెరికా ప్రభుత్వం వెల్లడి
హోర్ముజ్ జలసంధిలో మైన్ను ఢీకొని కార్గో నౌక మునక..