Share News

జనసేనలో చేరిన వంగవీటి రాధా

ABN , Publish Date - Oct 15 , 2026 | 05:46 AM

దివంగత వంగవీటి మోహన రంగా తనయుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ జనసేన పార్టీలో చేరారు. ఆయనను మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

జనసేనలో చేరిన వంగవీటి రాధా

  • కండువా కప్పి ఆహ్వానించిన డిప్యూటీ సీఎం పవన్‌

  • కలిసికట్టుగా ప్రజాసేవ చేద్దామని రాధాకు దిశానిర్దేశం

అమరావతి, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): దివంగత వంగవీటి మోహన రంగా తనయుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ జనసేన పార్టీలో చేరారు. ఆయనను మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బుధవారం సాయంత్రం మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి వెళ్లిన ఆయనకు ఆ పార్టీలోని కీలక నేతలు స్వాగతం పలికి, పవన్‌ కళ్యాణ్‌ వద్దకు తీసుకువెళ్లారు. వంగవీటి రాధాకృష్ణను చూసిన వెంటనే పవన్‌ ఆత్మీయంగా పలకరించి, ఆలింగనం చేసుకున్నారు. అనంతరం పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలికారు. అనంతరం రాధాకృష్ణ తన అనుచరులను పవన్‌కు పరిచయం చేశారు. ఆయన ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా మాట్లాడి ప్రత్యేకంగా ఫోటోలు దిగారు. జనసేన పార్టీ సిద్ధాంతాల కోసం కలసికట్టుగా పని చేద్దామని, ప్రజాసేవలో సమిష్టిగా ముందుకు వెళ్దామని రాధాకు ఆయన దిశానిర్దేశం చేశారు.

ఏవీఎస్‌ రాజు మరణంపై విచారం

నాగార్జున నిర్మాణ సంస్థ వ్యవస్థాపకులు, పద్మశ్రీ డా.అల్లూరి వెంకట సత్యనారాయణ రాజు మరణం పట్ల జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నిర్మాణ రంగంలో విశేష సేవలు అందించడంతో పాటు ఎన్‌సీసీ ఫౌండేషన్‌ ద్వారా విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో పేదలకు అండగా నిలిచారని పవన్‌ కొనియాడరు. ఏవీఎస్‌ రాజు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాడ సానుభూతి తెలియజేశారు.

ఈ వార్తలనూ చదవండి:

ఆటోమేటిక్ వర్క్ పర్మిట్ ఎక్స్‌టెన్షన్‌ రద్దు.. అమెరికా ప్రభుత్వం వెల్లడి

హోర్ముజ్ జలసంధిలో మైన్‌ను ఢీకొని కార్గో నౌక మునక..

Updated Date - Oct 15 , 2026 | 05:46 AM