ఇలాంటి వాళ్లు జీవితంలో ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు.!
ABN , Publish Date - Feb 03 , 2026 | 11:11 AM
చాణక్య నీతి ప్రకారం, ఈ వ్యక్తులు జీవితంలో ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు. అన్నీ ఉన్నప్పటికీ అసంతృప్తిగానే ఉంటారు. అయితే, ఎలాంటి వ్యక్తుల గురించి చాణక్యుడు ఇలా అంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: మన జీవితం సంతోషంగా ఉండాలా? లేదా? అన్నది ఎక్కువగా మన స్వభావం, అలవాట్ల మీదే ఆధారపడి ఉంటుందని చాణక్య నీతి చెబుతుంది. కొందరికి అన్నీ ఉన్నప్పటికీ జీవితంలో సంతృప్తి ఉండదు. కారణం .. వారి చెడు అలవాట్లే. అవే వారికి పెద్ద శత్రువులుగా మారతాయి. ఆచార్య చాణక్యుడి ప్రకారం, అన్నీ ఉన్నప్పటికీ జీవితంలో సంతోషంగా ఉండలేని వ్యక్తులు ఎవరో చుద్దాం..
ఎప్పుడూ ఫిర్యాదు చేసే వ్యక్తి
ఎప్పటికప్పుడు తన అదృష్టాన్ని, పరిస్థితులను లేదా ఇతరులను నిందించే వ్యక్తి ఎప్పుడూ సంతోషంగా ఉండలేడని చాణక్యుడు చెప్పారు. అలాంటి వాళ్లు ప్రతి విషయంలో లోపాలే చూస్తారు. ఫిర్యాదు చేసే అలవాటు మనసును బలహీనంగా చేస్తుంది. దాని వల్ల జీవితం మొత్తం బాధగానే అనిపిస్తుంది.
అత్యాశ ఎక్కువగా ఉన్న వ్యక్తి
దురాశ ఉన్న వ్యక్తికి ఎప్పటికీ తృప్తి ఉండదని చాణక్య నీతి చెబుతుంది. తన దగ్గర ఉన్నదానితో సంతోషపడకుండా ఇంకా ఇంకా కావాలనుకోవడం మనసుకు ప్రశాంతత ఇవ్వదు. డబ్బు, పదవి.. వీటికి అంతం ఉండదు. సంతృప్తి లేకపోతే సంతోషం కూడా ఉండదు.
కోపాన్ని అదుపులో పెట్టుకోలేని వ్యక్తి
కోపం మనిషికి అతిపెద్ద శత్రువు అని చాణక్యుడు చెప్పారు. చిన్న విషయానికే కోపం తెచ్చుకునే వ్యక్తి తన బంధాలు, గౌరవం, మనశ్శాంతిని కోల్పోతాడు. కోపంలో తీసుకునే నిర్ణయాలు జీవితమంతా బాధను మిగిల్చుతాయి.
చెడు సహవాసంలో ఉండే వ్యక్తి
మనతో ఉండే వాళ్ల ప్రభావం మన మీద చాలా ఉంటుంది. ప్రతికూలంగా ఆలోచించే వాళ్లతో, సోమరులుతో ఎప్పుడూ కలిసి ఉంటే మన ఆలోచనలూ అలాగే మారతాయి. చెడు సహవాసం మనిషిని తప్పుదారి పట్టించి జీవితాన్ని నాశనం చేస్తుందని చాణక్యుడు హెచ్చరించారు.
సమయం, అవకాశాలకు విలువ ఇవ్వని వ్యక్తి
సమయానికి మించిన విలువైనది ఏదీ లేదని చాణక్య నీతి చెబుతుంది. సమయాన్ని వృథా చేసే వ్యక్తి తన జీవితంలో వచ్చే అవకాశాలను కోల్పోతాడు. అలా కోల్పోయిన అవకాశాలు తర్వాత జీవితాంతం పశ్చాత్తాపానికి కారణమవుతాయి. సమయాన్ని గౌరవించకపోతే భవిష్యత్తు బాధతో నిండిపోతుంది.
మన సంతోషానికి కారణం బయటి పరిస్థితులు కాదు..మన అలవాట్లే. చెడు అలవాట్లను వదిలి మంచి ఆలోచనలను అలవాటు చేసుకుంటే జీవితం తప్పకుండా సంతోషంగా మారుతుందని చాణక్య నీతి చెబుతోంది.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
బాస్మతి బియ్యం వండేటప్పుడు ఈ తప్పులు చేయకండి.!
పానిక్ అటాక్‌ని ఎలా గుర్తించాలో తెలుసా?
For More Latest News