మీ విజయాన్ని చూసి ఇతరులు ఎందుకు అసూయపడతారో తెలుసా?
ABN , Publish Date - Apr 23 , 2026 | 03:30 PM
జీవితంలో విజయం సాధించినప్పుడు కొందరు ఎందుకు అసూయ చూపుతారో చాలామందికి అర్థం కాదు. ఈ అసూయ వెనుక ఉన్న అసలు కారణాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: చాణక్య నీతి ప్రకారం, జీవితంలో విజయం సాధించినప్పుడు కొందరిలో అసూయ భావం రావడం సహజం. సంతోషంగా ఉన్నప్పుడు లేదా విజయాలను పంచుకున్నప్పుడు, కొందరు ఆనందించకుండా మాట్లాడకుండా ఉండటం లేదా దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. మీ సంతోషం, విజయాలు వారికి ఆనందం ఇవ్వకుండా బాధ కలిగించడానికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయని మీకు తెలుసా?
ఇతరులతో పోల్చుకునే అలవాటు
చాలా మంది తమను ఇతరులతో పోల్చుకుంటూ ఉంటారు. ఇలా పోల్చుకోవడం వల్ల అసూయ భావం పెరుగుతుంది. ఇతరులు కష్టపడి విజయం సాధిస్తే, వారు తమ లోపాలను గుర్తించకుండా అసూయపడతారు.
ఆత్మవిశ్వాసం లేకపోవడం
ఆత్మవిశ్వాసం తక్కువగా ఉన్నవారు ఇతరుల విజయాన్ని తట్టుకోలేరు. తాము కూడా అలాంటి విజయం సాధించలేమని భావించి బాధపడతారు. ఈ ఆలోచనే అసూయకు కారణమవుతుంది.
కష్టపడకపోవడం
కష్టపడకుండా విజయం కోరుకునే వారు ఇతరుల కష్టాన్ని అర్థం చేసుకోలేరు. ఇతరుల విజయాన్ని అదృష్టంగా భావించి తమను తాము సమర్థించుకుంటారు.
ప్రతికూల ఆలోచనలు
ఎప్పుడూ నెగటివ్‌గా ఆలోచించే వారు ఇతరుల విజయాన్ని అంగీకరించలేరు. ప్రతి విషయాన్ని పోల్చడం, తప్పులు వెతకడం వారి అలవాటుగా మారుతుంది. దీనివల్ల అసూయ మరింత పెరుగుతుంది. చాణక్య నీతి ప్రకారం, అసూయ అనేది మన మనసు స్థితికి సంబంధించినది. దీన్ని అర్థం చేసుకుంటే మనం ప్రశాంతంగా, విజయవంతంగా జీవించగలం.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
పక్షుల గుంపులు 'వి' ఆకారంలోనే ఎందుకు ఎగురుతాయి.. దీని వెనుక కారణమేంటి?
ప్రముఖ గాయని ఆశా భోంస్లే మృతిపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి
For More Latest News