నాదెండ్ల మనోహర్‌ను ఫోన్లో పరామర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ABN , Publish Date - Apr 23 , 2026 | 02:59 PM
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు నిన్న కన్నుమూసిన సంగతి తెలిసిందే. భాస్కరరావు మరణంపై తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. నాదెండ్ల మనోహర్‌ను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫోన్లో పరామర్శించారు.
అమరావతి , ఏప్రిల్ 23: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు నిన్న(బుధవారం) కన్నుమూసిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. భాస్కరరావు మరణంపై తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. నాదెండ్ల భాస్కరరావు కుమారుడు నాదెండ్ల మనోహర్ ప్రస్తుతం ఏపీ కేబినెట్‌లో పౌరసరఫరాలశాఖ మంత్రిగా ఉన్నారు. నాదెండ్ల మనోహర్‌ను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫోన్లో పరామర్శించారు.
శస్త్రచికిత్స జరగటంతో బయటకురాలేని పరిస్థితిలో నాదెండ్ల భాస్కర రావు అంత్యక్రియల్లో పాల్గొనలేకపోతున్నానని మంత్రి నాదెండ్ల మనోహర్‌కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ విషాదం నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. భాస్కరరావు మృతికి పవన్ కల్యాణ్ సంతాపం తెలిపారు.
1935 జూన్ 23న గుంటూరులో నాదెండ్ల భాస్కరరావు జన్మించారు. ఆయన వృత్తిరీత్యా లాయర్ కాగా.. కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన 1978లో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీచేసి విజయం సాధించారు. అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. నాదెండ్ల భాస్కరరావు కాంగ్రెస్ పార్టీని వీడి 1982లో ఎన్టీఆర్ వెంట నడిచారు. తెలుగుదేశం పార్టీ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం నాదెండ్ల భాస్కరరావు రాజకీయ వారసుడిగా కుమారుడు మంత్రి నాదెండ్ల మనోహర్ కొనసాగుతున్నారు.
ఇవి కూడా చదవండి:
సుబ్రహ్మణ్యం హత్య కేసు నిందితులను వదిలే ప్రసక్తే లేదు: మంత్రి సవిత
పరిశ్రమలు వస్తున్నాయ్.. హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు: సీఎం చంద్రబాబు