Share News

కొబ్బరి నూనె Vs బాదం నూనె.. జుట్టు పెరుగుదలకు ఏది మంచిది?

ABN , Publish Date - May 19 , 2026 | 10:41 AM

జుట్టు రాలడం, పలుచబడటం వంటి సమస్యలు ఇప్పుడు చాలా మందిని వేధిస్తున్నాయి. ఈ సమస్యలకు సహజ పరిష్కారంగా కొబ్బరి నూనె, బాదం నూనెను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే, జుట్టు పెరుగుదలకు ఈ రెండింటిలో ఏది మంచిదో మీకు తెలుసా?

కొబ్బరి నూనె Vs బాదం నూనె.. జుట్టు పెరుగుదలకు ఏది మంచిది?
Almond Oil Vs Coconut Oil for Hair

ఇంటర్నెట్ డెస్క్: జుట్టు ఆరోగ్యంగా, పొడవుగా పెరగాలని చాలా మంది అనుకుంటారు. ఇందుకోసం మార్కెట్లో లభించే అనేక రకాల హెయిర్ ప్రొడక్ట్స్ వాడినా, ఆశించిన ఫలితాలు అందకపోవచ్చు. అయితే సహజమైన కొబ్బరి నూనె, బాదం నూనె జుట్టు సంరక్షణలో ఎంతో ఉపయోగపడతాయి. ఈ రెండింటిలో ఏది జుట్టు పెరుగుదలకు మంచిదో తెలుసుకుందాం..


కొబ్బరి నూనె ప్రయోజనాలు:

కొబ్బరి నూనె జుట్టుకు సహజ పోషణ అందిస్తుంది. ఇందులో ఉండే లారిక్ యాసిడ్ జుట్టుకు తేమను అందించి, పొడిబారకుండా కాపాడుతుంది. అలాగే జుట్టులో ప్రొటీన్ నష్టం తగ్గించి, కుదుళ్లను బలపరుస్తుంది. దీంతో జుట్టు విరిగిపోవడం, రాలిపోవడం తగ్గుతుంది. కొబ్బరి నూనెలో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటంతో చుండ్రు సమస్య తగ్గేందుకు కూడా సహాయపడుతుంది.

బాదం నూనె ప్రయోజనాలు:

బాదం నూనెలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ E, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. ఇవి జుట్టుకు పోషణ అందించి, మెరిసేలా చేస్తాయి. విటమిన్ E జుట్టును సూర్యరశ్మి, కాలుష్యం ప్రభావం నుంచి కాపాడుతుంది. బాదం నూనె వాడటం వల్ల జుట్టు కుదుళ్లు బలపడటంతో పాటు దువ్వేటప్పుడు జుట్టు రాలడం తగ్గుతుంది. తల చర్మం పొడిబారడం, దురద వంటి సమస్యలకు కూడా ఇది ఉపశమనం కలిగిస్తుంది.


జుట్టు పెరుగుదలకు ఏది మంచిది?

జుట్టు పొడవుగా, దట్టంగా పెరగాలంటే కొబ్బరి నూనె ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇది కుదుళ్లను బలపరచి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. అలాగే పలుచని జుట్టు ఉన్నవారు బాదం నూనె వాడితే జుట్టుకు తేలికపాటి పోషణ లభించి, జుట్టు మృదువుగా మారుతుంది. జుట్టు సమస్యను బట్టి ఈ రెండు నూనెల్లో ఏదైనా ఉపయోగించవచ్చు. జుట్టు రాలడం, చుండ్రు ఎక్కువగా ఉంటే కొబ్బరి నూనె మంచిది. జుట్టు పొడిబారడం, మెరుపు తగ్గడం వంటి సమస్యలు ఉంటే బాదం నూనె ఉపయోగపడుతుంది.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

సిగరెట్లు తాగకపోయినా పెదాలు నల్లగా ఉన్నాయా? ఈ చిట్కాలు ట్రై చేయండి

రాగి బాటిల్‌లో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు మాత్రం చేయొద్దు

For More Latest News

Updated Date - May 19 , 2026 | 12:59 PM