జుట్టు రాలుతోందా? తలస్నానం చేసే ముందు ఇలా చేయండి..
ABN , Publish Date - May 23 , 2026 | 11:01 AM
ఈ రోజుల్లో చాలా మంది జుట్టు రాలడం సమస్యతో బాధపడుతున్నారు. కాలుష్యం, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల జుట్టు బలహీనపడుతోంది. అయితే, ఈ సింపుల్ చిట్కాతో జుట్టు రాలడం తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఈ రోజుల్లో చాలా మంది జుట్టు రాలడం సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. కాలుష్యం, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల జుట్టు బలహీనపడుతోంది. ఖరీదైన షాంపూలు, హెయిర్ ప్రొడక్ట్స్ వాడినా కొందరికి ఆశించిన ఫలితం కనిపించదు. అయితే తలస్నానం చేసే ముందు ఈ సింపుల్ చిట్కా పాటిస్తే జుట్టు రాలడం తగ్గుందని నిపుణులు చెబుతున్నారు.
ఆవ నూనెతో మసాజ్
తలస్నానం చేయడానికి 5 నిమిషాల ముందు లేదా రాత్రి పడుకునే ముందు ఆవ నూనెను తలకు రాసి మృదువుగా మసాజ్ చేయాలి. తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే జుట్టు రాలడం తగ్గేందుకు సహాయపడొచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఆవ నూనె వల్ల కలిగే ప్రయోజనాలు
ఆవ నూనెలో ఒమేగా-3, ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి.
విటమిన్ E, యాంటీఆక్సిడెంట్లు జుట్టుకు పోషణ ఇస్తాయి.
జుట్టు పొడిబారకుండా సహాయపడుతుంది.
తల చర్మంలో తేమ నిల్వ ఉండేలా చేస్తుంది.
చుండ్రు సమస్య తగ్గించడంలో ఉపయోగపడొచ్చు.
అయితే ఏ నూనె అయినా మితంగా ఉపయోగించడం మంచిది. జుట్టు సమస్యలు ఎక్కువగా ఉంటే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
మంగళసూత్రంలో ముత్యాలు, పగడాలు ఎందుకు తప్పనిసరిగా ఉంటాయో తెలుసా?
వేసవిలో గుడ్లు తినడం మంచిదేనా?
For More Latest News