Share News

ఇరాన్‌పై యుద్ధాన్ని కొనసాగించొద్దు.. ట్రంప్‌ను సౌదీ అరేబియా ఎందుకు ఆపుతోంది..

ABN , Publish Date - Aug 03 , 2026 | 04:10 PM

ఇరాన్‌పై దాడులకు తాత్కాలిక విరామం ఇచ్చి చర్చలు సాగించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించుకున్నారు. ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక సౌదీ అరేబియా ఒత్తిడి కూడా పని చేసినట్టు సమాచారం.

ఇరాన్‌పై యుద్ధాన్ని కొనసాగించొద్దు.. ట్రంప్‌ను సౌదీ అరేబియా ఎందుకు ఆపుతోంది..
Donald Trump, Mohammed bin Salman

ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌పై దాడులకు తాత్కాలిక విరామం ఇచ్చి చర్చలు సాగించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించుకున్నారు. ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక సౌదీ అరేబియా ఒత్తిడి కూడా పని చేసినట్టు సమాచారం. ఉద్రిక్తతలను మరింత పెంచవద్దని ట్రంప్‌నకు సౌదీ అరేబియా విజ్ఞప్తి చేసింది. యుద్ధాన్ని మరింత విస్తరించడం వల్ల గల్ఫ్ ప్రాంత భద్రతకు తీవ్ర ముప్పు ఏర్పడుతుందని సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం (Saudi Arabia Donald Trump).


ఇరాన్ చమురు, ఇంధన మౌలిక సదుపాయాలపై అమెరికా భారీ దాడులు చేస్తే, గల్ఫ్ దేశాల చమురు క్షేత్రాలు, రిఫైనరీలు, నౌకాశ్రయాలు, ఇతర కీలక మౌలిక సదుపాయాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని సౌదీ భయపడుతోంది. అదే జరిగితే ప్రాంతీయ భద్రతతో పాటు ప్రపంచ ఇంధన మార్కెట్లపై కూడా తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని సౌదీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్‌నకు సర్ది చెప్పేందుకు సౌదీ యువరాజు ప్రయత్నించారు. శనివారం ఆయనతో ఫోన్‌లో మాట్లాడారు (US Iran War).


దౌత్యపరమైన చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించాలని సౌదీ అరేబియా కోరుతోంది. యుద్ధం మరింత తీవ్రమైతే హోర్ముజ్ జలసంధి గుండా చమురు రవాణా దెబ్బతింటుంది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది. అందువల్ల సైనిక చర్యల కంటే చర్చలకు ప్రాధాన్యం ఇవ్వాలని అమెరికాను సౌదీ ప్రభుత్వం కోరుతోంది.


ఇవి కూడా చదవండి..

విద్యార్థులపై కేసులు ఉండవు.. హామీపై కట్టుబడి ఉన్నాం: సుప్రీంకోర్టుకు కేంద్రం వివరణ


బరువు తగ్గడం కోసం ప్రమాదకర ప్రయత్నం.. టీలో ఆ ద్రవాన్ని కలిపి తాగితే..

Updated Date - Aug 03 , 2026 | 04:13 PM