మొజ్తాబా ఆచూకీ చెబితే రూ.92 కోట్లు.. రివార్డు ప్రకటించిన యూఎస్
ABN , Publish Date - Mar 14 , 2026 | 10:54 AM
ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఎవరు పగ్గాలు చేపట్టినా తమ తదుపరి టార్గెట్ అయనే అవుతారని ఇంతకుముందే ప్రకటించిన అమెరికా ఆ దిశగా మరో ముందడుగు వేసింది. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ ఆచూకీ కానీ, ఆయనకు సంబంధించిన కీలక సమాచారం కానీ అందించిన వారికి భారీ రివార్డు ప్రకటించింది.
వాషింగ్టన్: ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఎవరు పగ్గాలు చేపట్టినా తమ తదుపరి టార్గెట్ అయనే అవుతారని ఇంతకుముందే ప్రకటించిన అమెరికా ఆ దిశగా మరో ముందడుగు వేసింది. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ (Mojtaba Khamenei) ఆచూకీ కానీ, ఆయనకు సంబంధించిన కీలక సమాచారం కానీ అందించిన వారికి భారీ రివార్డు ప్రకటించింది. ఆచూకీ ఇచ్చిన వారికి 10 మిలియన్ డాలర్లు (రూ.92 కోట్లు) ఇస్తామని అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది. 'రివార్డ్ ఫర్ జస్టిస్' (RFJ) కార్యక్రమం క్రింద ఈ బౌంటీ ఇస్తామని తెలిపింది.
అమెరికా విదేశాంగ నిర్వహించే ఒక ముఖ్యమైన ఉగ్రవాద నిరోధక కార్యక్రమమే 'రివార్డ్ ఫర్ జస్టిస్'. ఈ ప్రోగ్రాం కింద అంతర్జాతీయ నేరస్తులు, నెట్‌వర్క్‌ల సమాచారం అందించి, వారిని పట్టుకోవడంలో సహాయపడిన వారికి మిలియన్ డాలర్ల రివార్డు ఇస్తుంటారు. అమెరికన్ల రక్షణ, జాతీయ భద్రత బలోపేతం చేయడమే ఆర్‌ఎఫ్‌జే లక్ష్యం.
వీరిపై కూడా రివార్డు
కాగా, అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించిన వ్యక్తుల జాబితా మొజ్తాబాతో పాటు ఆయన కార్యాలయ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అలీ అస్గర్ హెజాజీ, సెక్యూరిటీ కౌన్సిల్ చీప్ అలీ లారీజానీ, ఇతర సీనియర్ అధికారులు ఉన్నారు. ఆచూకీ తెలిపిన వారికి రివార్డుతో పాటు వారిని వేరే ప్రాంతానికి తరలించే సదుపాయం కూడా కల్పిస్తామని అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది.
ఇవి కూడా చదవండి..
ఇరాన్ ఆర్థిక కిరీటం ఖర్గ్ ఐలాండ్‌పై విరుచుకుపడిన అమెరికా సైన్యం
దుబాయ్ ఖాళీ.. ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉందంటే..