Share News

ఇరాన్ ఆర్థిక కిరీటం ఖర్గ్ ఐలాండ్‌పై విరుచుకుపడిన అమెరికా సైన్యం

ABN , Publish Date - Mar 14 , 2026 | 09:31 AM

పశ్చిమాసియాలో యుద్ధం అంతకంతకూ తీవ్రమవుతోంది. ఇరాన్ చమురుకు వ్యూహాత్మక హబ్‌గా ఉన్న ఖర్గ్ ఐలాండ్‌పై అమెరికా సెంట్రల్ కమాండ్ అత్యంత శక్తివంతమైన దాడులు జరిపినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా ప్రకటించారు.

ఇరాన్ ఆర్థిక కిరీటం ఖర్గ్ ఐలాండ్‌పై విరుచుకుపడిన అమెరికా సైన్యం
Kharg Island

టెహ్రాన్: పశ్చిమాసియాలో యుద్ధం అంతకంతకూ తీవ్రమవుతోంది. ఇరాన్ చమురుకు వ్యూహాత్మక హబ్‌గా ఉన్న ఖర్గ్ ఐలాండ్ (Kharg Island)పై అమెరికా సెంట్రల్ కమాండ్ అత్యంత శక్తివంతమైన దాడులు జరిపినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ట్రూత్ సోషల్ వేదికగా ప్రకటించారు. తన ఆదేశాలతో జరిగిన ఈ దాడిలో ఐలాండ్‌లోని సైనిక కేంద్రాలు తునాతునకలు అయినట్టు తెలిపారు. ఇందుకు సంబంధించిన 'బ్లాక్ అండ్ వైట్' వీడియోను ఆయన విడుదల చేశారు. అయితే దీనిపై ఎలాంటి క్యాప్షన్ లేదు.


మధ్యప్రాచ్యం చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన దాడులు జరిపామని, అయితే ఖర్గ్ ఐలాండ్‌లోని చమురు మౌలిక సదుపాయాల జోలికి వెళ్లలేదని ట్రంప్ చెప్పారు. వ్యాపార నౌకల రాకపోకలకు కీలకమైన హోర్ముజ్ జలసంధిని అడ్డుకోవాలని చూస్తే సహించేది లేదని ఇరాన్‌ను హెచ్చరించారు. జలసంధిలో నౌకల స్వేచ్ఛా ప్రయాణానికి అడ్డుతగిలితే ఖర్గ్ ద్వీపంలోని చమురు మౌలిక సదుపాయాలను టార్గెట్ చేసే అవకాశాలను పరిశీలిస్తామని చెప్పారు. ఇరాన్ ఎగుమతి చేసే చమురులో 90 శాతం ఖర్గ్ దీవి నుంచే సరఫరా అవుతుంది.


ప్రతీకారం తీర్చుకుంటాం: ఇరాన్

ఖర్గ్ ఐలాండ్‌పై అమెరికా సెంట్రల్ కమాండ్ జరిపిన దాడులకు ఇరాన్ తీవ్ర స్థాయిలో స్పందించింది. ఇరాన్ ఇంధన సదుపాయాలపై దాడులు చేస్తే అమెరికాకు సహకారం అందిస్తున్న సంస్థలకు చెందిన చమురు, ఇంధన మౌలిక సదుపాయాలను బూడిద చేస్తామని ఇరాన్ మిలటరీ హెడ్‌క్వార్టర్స్ హెచ్చరించింది.


ఇవి కూడా చదవండి..

దుబాయ్ ఖాళీ.. ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉందంటే.

పాక్‌పై అఫ్గాన్‌ డ్రోన్‌ దాడులు

Updated Date - Mar 14 , 2026 | 10:58 AM