Share News

పాక్‌పై అఫ్గాన్‌ డ్రోన్‌ దాడులు

ABN , Publish Date - Mar 14 , 2026 | 04:43 AM

పాకిస్థాన్‌పై అఫ్గానిస్థాన్‌ డ్రోన్‌లతో ప్రతిదాడులు జరిపింది. ఖైబర్‌ పక్తుంఖ్వాలోని కొహత్‌ ప్రాంతంలో ఉన్న పాక్‌ సైనిక కేంద్రాలు, స్థావరాలపై అఫ్గాన్‌ డ్రోన్‌ దాడులకు పాల్పడింది.

పాక్‌పై అఫ్గాన్‌ డ్రోన్‌ దాడులు

కాబుల్‌, మార్చి 13: పాకిస్థాన్‌పై అఫ్గానిస్థాన్‌ డ్రోన్‌లతో ప్రతిదాడులు జరిపింది. ఖైబర్‌ పక్తుంఖ్వాలోని కొహత్‌ ప్రాంతంలో ఉన్న పాక్‌ సైనిక కేంద్రాలు, స్థావరాలపై అఫ్గాన్‌ డ్రోన్‌ దాడులకు పాల్పడింది. కోహత్‌ మిలిటరీ కోట, డ్యూరాండ్‌ లైన్‌ వెంబడి వార్‌ కమాండ్‌ సెంటర్‌, సైనికుల క్వార్టర్లు, సైనిక డిపోలు ఈ దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్నాయని అఫ్గాన్‌ రక్షణ శాఖ ఎక్స్‌ వేదికగా తెలిపింది. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందని వెల్లడించింది. ఇస్లామాబాద్‌, కరాచీ, క్వెట్టాలోనూ దాడులకు పాల్పడతామని తాలిబన్లు హెచ్చరించారు. అంతకు ముందు అఫ్గాన్‌ ఖోస్ట్‌ ప్రావిన్స్‌లోని అలిషెర్‌-టెరెజాయ్‌ జిల్లాలో పాకిస్థాన్‌ కాల్పులు జరిపింది. ఈ దాడుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. దీంతోపాటు కాందహార్‌ ఎయిర్‌పోర్ట్‌ సమీపంలోని కమ్‌ ఎయిర్‌ అనే ఓ ప్రైవేట్‌ ఎయిర్‌లైన్స్‌ ఇంధన డిపోలపై పాక్‌ వైమానిక దళం దాడులు జరిపింది. అఫ్గాన్‌ రాజధాని కాబుల్‌తో పాటు ఇతర ప్రాంతాల్లోనూ పాక్‌ వైమానిక దాడులకు పాల్పడింది.

Updated Date - Mar 14 , 2026 | 04:43 AM