Share News

నా మాటలు సీరియస్‌గా తీసుకోండి.. ఆలస్యమైతే నష్టం తప్పదు: ట్రంప్ వార్నింగ్

ABN , Publish Date - Mar 26 , 2026 | 07:31 PM

ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. ఒప్పందం విషయంలో మరీ ఆలస్యం చేస్తే పరిస్థితులు తీవ్రంగా మారిపోతాయని హెచ్చరించారు. అమెరికాతో ఒప్పందం కోసం ఒకవైపు ప్రయత్నిస్తూనే, బయటకు మరోలా మాట్లాడుతోందని ఇరాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

నా మాటలు సీరియస్‌గా తీసుకోండి.. ఆలస్యమైతే నష్టం తప్పదు: ట్రంప్ వార్నింగ్
Trump warning Iran

ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. ఒప్పందం విషయంలో మరీ ఆలస్యం చేస్తే పరిస్థితులు తీవ్రంగా మారిపోతాయని హెచ్చరించారు. అమెరికాతో ఒప్పందం కోసం ఒకవైపు ప్రయత్నిస్తూనే, బయటకు మరోలా మాట్లాడుతోందని ఇరాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరీ ఆలస్యం కాకముందే సీరియస్‌గా వ్యవహరించడం మంచిదని హితవు పలికారు (Trump warning Iran).


'ఇరాన్ మిలిటరీ పూర్తిగా నాశనమైంది. తిరిగి పుంజుకునే అవకాశం లేదు. దీంతో వారు ఒక ఒప్పందం కోసం మమ్మల్ని వేడుకుంటున్నారు. మరోవైపు మా ప్రతిపాదనలను పరిశీలిస్తున్నామని చెబుతున్నారు. వారు చాలా తప్పు చేస్తున్నారు. మరీ ఆలస్యం కాకముందే వారు ఒక నిర్ణయం తీసుకుంటే మంచిది. ఆలస్యమైతే వెనక్కి తిరిగి చూసే ప్రసక్తే లేదు. పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి' అని తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ ద్వారా హెచ్చరించారు (US Iran peace talks 2026).


అమెరికాతో చర్చల పట్ల ఇరాన్ భిన్నంగా ప్రకటనలు చేస్తోంది (Iran US conflict). ఘర్షణలు ముగించేందుకు చర్చలు జరిపే ఉద్దేశం ఉద్దేశం తమకు లేదని, అమెరికా ప్రతిపాదనలను పరిశీలిస్తున్నామని ఇరాన్ విదేశాంగ మంత్రి వ్యాఖ్యానించారు. అమెరికాతో చర్చలు జరుగుతున్న సమయంలో పశ్చిమాసియా దేశాలపై ఇరాన్ దాడులకు పాల్పడుతోంది.


ఇవి కూడా చదవండి:

సంగక్కర రికార్డ్ బ్రేక్ చేసిన సౌతాఫ్రికా ప్లేయర్

ముంబైకి సాధ్యమా?

Updated Date - Mar 26 , 2026 | 07:32 PM