Share News

శ్రీరామ నవమి శోభాయాత్రకు భారీ భద్రత.. 3000 మంది పోలీసులతో బందోబస్తు

ABN , Publish Date - Mar 26 , 2026 | 06:58 PM

శ్రీరామ నవమి సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించనున్న శోభాయాత్రకు పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. వేలాదిమంది భక్తులు పాల్గొనే ఈ యాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.

శ్రీరామ నవమి శోభాయాత్రకు భారీ భద్రత.. 3000 మంది పోలీసులతో బందోబస్తు
Sri Rama Navami Shobha Yatra Hyderabad

హైదరాబాద్: శ్రీరామ నవమి సందర్భంగా నిర్వహించే శోభాయాత్రకు నగర పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సుమారు 3000 మంది పోలీసులతో పాటు టాస్క్ ఫోర్స్, గ్రే హౌండ్స్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఆక్టోపస్ బలగాలు మోహరించనున్నాయి. శోభాయాత్ర మధ్యాహ్నం 1 గంటకు సీతారాం బాగ్ ఆలయం నుంచి ప్రారంభమవుతుంది. బోయిగూడా కమాన్, దూల్‌పేట్, జాలి హనుమాన్, పురానాపూల్, జుమ్మెరాత్ బజార్, చుడీబజార్, బేగంబజార్ ఛత్రి, సిద్ధంబర్ బజార్, పుట్లిబౌలి మార్గంగా హనుమాన్ టేక్డీ వరకు సుమారు 7 కిలోమీటర్ల మేర ఈ శోభాయాత్ర కొనసాగనుంది.


250 సీసీ కెమెరాలు

యాత్రలో లక్ష మందికి పైగా భక్తులు పాల్గొనే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశారు. మొత్తం 250 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, వాటిని కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేశారు. అదనంగా డ్రోన్ల ద్వారా కూడా యాత్రను నిరంతరం పర్యవేక్షించనున్నారు. పాతబస్తీలోని సున్నిత ప్రాంతాలను గుర్తించి, అక్కడ ప్రత్యేక పికెట్లు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను మరింత పెంచారు. శాంతి భద్రతలతో పాటు జీహెచ్ఎంసీ ఇతర శాఖలతో కలిసి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.


ట్రాఫిక్ ఆంక్షలు

యాత్ర సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ముఖ్యంగా పురానాపూల్, దూల్‌పేట్, బేగంబజార్, నాంపల్లి, అఫ్జల్‌గంజ్, గౌలిగూడ, సుల్తాన్ బజార్ ప్రాంతాల్లో వాహన రాకపోకలను పరిమితం చేశారు. పిక్‌పాకెట్, చైన్ స్నాచింగ్ వంటి ఘటనలు జరగకుండా క్రైమ్ టీమ్‌లు, షీ టీమ్‌లను ఏర్పాటు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

క్షతగాత్రుల వివరాలు విడుదల.. మార్కాపురంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

సీతారాముల వారికి పటు వస్త్రాలు సమర్పించనున్న సీఎం రేవంత్: మంత్రి తుమ్మల

For More TG News

Updated Date - Mar 26 , 2026 | 07:12 PM