Share News

ఇంధన నిల్వలు ఉన్నాయి.. ఆందోళన వద్దు: స్టీఫెన్ రవీంద్ర

ABN , Publish Date - Mar 26 , 2026 | 02:04 PM

రాష్ట్రంలో ఇంధన నిల్వలు సరిపడ ఉన్నాయని.. దీనిపై ఆందోళన అవసరం లేదని ప్రజలకు పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్పష్టం చేశారు.

ఇంధన నిల్వలు ఉన్నాయి.. ఆందోళన వద్దు: స్టీఫెన్ రవీంద్ర

హైదరాబాద్, మార్చి 26: రాష్ట్రంలో ఇంధన నిల్వలు ఉన్నాయని.. దీనిపై ఆందోళన అవసరం లేదని ప్రజలకు పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. బుధవారం 2,123 ట్యాంకర్స్ పెట్రోల్ సరఫరా చేశామన్నారు. అలాగే 10,799 లీటర్లు సరఫరా చేశారని వివరించారు. యావరేజ్‌గా 5,883 లీటర్ల పెట్రోల్ వినియోగం ఉంటే.. బుధవారం ఒక్క రోజే 84 శాతం అధికంగా పెట్రోల్ సరఫరా చేశారని చెప్పారు. 22,127 కిలో లీటర్ల డీజిల్ ఆయిల్ కంపెనీలు సరఫరా చేశాయని పేర్కొన్నారు.


హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ 596 అవుట్ లెట్స్ ఉన్నాయని అన్నారు. ప్రతీ బంక్‌లో పౌరసరఫర, సివిల్ సప్లై, రెవెన్యూ, పోలీస్, లీగల్ మెట్రాలజీ అధికారుల బృందం పరిశీలన చేస్తుందని తెలిపారు. బుధవారం కంటే.. గురువారం పెట్రోల్ బంకుల వద్ద రద్దీ తగ్గిందన్నారు. రాష్ట్రంలో గృహ వినియోగంలో 1,28,24,087 ఎల్పీజీ కనెక్షన్లు ఉన్నాయని.. ప్రతీ రోజు 2,20,000 గ్యాస్ బుకింగ్స్ జరుగుతున్నాయని పేర్కొన్నారు.


బుధవారం ఒక్క రోజే 2,19,980 సిలిండర్లు సరఫరా చేశామన్నారు. వినియోగదారులు అధికంగా బుకింగ్స్ చేయడం వల్ల కొంత ఇబ్బంది ఏర్పడుతుందని స్టీఫెన్ రవీంద్ర వివరించారు. అలాగే 1,03,275 పైప్ న్యాచురల్ గ్యాస్ (పీఎన్జీ) కనెక్షన్లు ఉన్నాయని చెప్పారు. 2,78,418 క్యూబిక్ మీటర్లు సరఫరా చేస్తున్నారని తెలిపారు. కేంద్రం ఆదేశాల మేరకు పీఎన్జీ, సీఎన్జీని విస్తరించాల్సి ఉందని చెప్పారు. 24 గంటల్లో ప్లాంట్లకు అనుమతి ఇవ్వడంతో పాటు పలు రాయితీలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిందని స్టీఫెన్ రవీంద్ర వివరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

క్షతగాత్రుల వివరాలు విడుదల.. మార్కాపురంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

సీతారాముల వారికి పటు వస్త్రాలు సమర్పించనున్న సీఎం రేవంత్: మంత్రి తుమ్మల

For More TG News And Telugu News

Updated Date - Mar 26 , 2026 | 02:15 PM