ఇరాన్‌పై వెయ్యి మిసైళ్లతో దాడి: డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్..
ABN , Publish Date - Jul 11 , 2026 | 12:04 PM
ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఘాటైన హెచ్చరిక జారీ చేశారు. తనపై హత్యాయత్నం చేయడానికి ఇరాన్ ప్రయత్నిస్తే, ఆ దేశంపై క్షిపణుల వర్షం తప్పదని వార్నింగ్ ఇచ్చారు.
ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఘాటైన హెచ్చరిక జారీ చేశారు. తనపై హత్యాయత్నం చేయడానికి ఇరాన్ ప్రయత్నిస్తే, ఆ దేశంపై క్షిపణుల వర్షం తప్పదని వార్నింగ్ ఇచ్చారు. తాము ఇప్పటికే 1,000 క్షిపణులను సిద్ధం చేసి ఉంచామని ఆయన పేర్కొన్నారు. అవసరమైతే వేల క్షిపణులతో భారీ ప్రతీకార దాడులు జరుగుతాయని ట్రంప్ తన సామాజిక మాధ్యమ వేదిక 'ట్రూత్' ద్వారా వెల్లడించారు (Trump Iran Warning).
'నన్ను హత్య చేయాలని ఇరాన్ ప్రయత్నిస్తే భారీ విధ్వంసం తప్పదు. 1,000 క్షిపణులు ఇప్పటికే లక్ష్యాలను గురిపెట్టి సిద్ధంగా ఉన్నాయి. అంతటితోనే ఆగదు. అవసరమైతే మరిన్ని దాడులు జరుగుతాయి. ఇప్పటికే ఈ విషయమై సైన్యానికి ఆదేశాలు అందాయి. ఇరాన్‌లోని అన్ని ప్రాంతాలను ధ్వంసం చేయడానికి అమెరికా సైన్యం సిద్ధంగా ఉంది' అని ట్రంప్ హెచ్చరించారు (Donald Trump 1000 Missiles).
తనపై ఇరాన్ హత్యాయత్నం చేసే అవకాశం ఉందని గతంలో కూడా ట్రంప్ ఆరోపించారు (US Iran Tensions). అలాంటి ప్రయత్నం జరిగితే అమెరికా ప్రతిస్పందన అత్యంత తీవ్రంగా ఉంటుందని, ఇరాన్ కీలక సైనిక స్థావరాలపై భారీ దాడులు జరుగుతాయని స్పష్టం చేశారు. కాగా, ఇప్పటికే హోర్ముజ్ జలసంధి, అణు ఒప్పందం వంటి అంశాలపై ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో ఈ హెచ్చరికలు పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసే అవకాశం కనబడుతోంది.
ఇవి కూడా చదవండి..
పెరిగిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..
ఇరాన్‌కు 24 గంటల గడువు.. హోర్ముజ్‌పై అమెరికా తుది హెచ్చరిక..