వెనెజువెలా భూకంపాల విలయం.. 4 వేలు దాటిన మృతులు.. ఇంకా వేల మంది శిథిలాల కిందే..
ABN , Publish Date - Jul 11 , 2026 | 10:55 AM
వెనెజువెలాలో జూన్ 24వ తేదీన కొద్ది సెకెన్ల వ్యవధిలో సంభవించిన రెండు తీవ్ర భూకంపాలు భారీ విషాదాన్ని మిగిల్చాయి. తాజా అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటికి మృతుల సంఖ్య 4 వేల మార్కును దాటింది. వేలాది మంది ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాలేదు.
వెనెజువెలాలో జూన్ 24వ తేదీన కొద్ది సెకెన్ల వ్యవధిలో సంభవించిన రెండు తీవ్ర భూకంపాలు భారీ విషాదాన్ని మిగిల్చాయి. తాజా అధికారిక లెక్కల ప్రకారం మృతుల సంఖ్య 4 వేల మార్కును దాటింది. వేలాది మంది ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాలేదు. శిథిలాల కింద మరిన్ని మృతదేహాలు చిక్కుకుని ఉండొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది (Venezuela Quake Death Toll).
జూన్ 24న వరుసగా 7.5, 7.2 తీవ్రతలతో సంభవించిన భూకంపాలు ముఖ్యంగా లా గువెరా తీర ప్రాంతాన్ని ఎక్కువగా దెబ్బతీశాయి. అనేక బహుళ అంతస్తుల భవనాలు కుప్పకూలగా, వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఈ ప్రకృతి విపత్తు కారణంగా 16,740 మంది గాయపడ్డారు. శిథిలాల తొలగింపు కార్యక్రమం ఇంకా కొనసాగుతున్నందున మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనబడుతోంది (Venezuela Earthquake).
భూకంపాల కారణంగా వేలాది కుటుంబాలు తమ ఇళ్లను కోల్పోయాయి. తాత్కాలిక శిబిరాల్లో ఆశ్రయం పొందిన ప్రజలు తాగునీరు, పారిశుధ్యం, వైద్య సేవల కొరతను ఎదుర్కొంటున్నారు. విపత్తు ప్రభావిత ప్రాంతాల పునర్నిర్మాణం కోసం, బాధితులకు అత్యవసర సహాయం అందించేందుకు ఐక్యరాజ్యసమితి వందల మిలియన్ల డాలర్ల నిధులను సమీకరించే ప్రయత్నాలు ప్రారంభించింది (Venezuela Twin Earthquakes).
శిథిలాలను తొలగించే కార్యక్రమంలో దేశీయ, అంతర్జాతీయ సేవా సంస్థలు పాల్గొంటున్నాయి. అయినప్పటికీ చాలా మంది గల్లంతైన తమ కుటుంబ సభ్యుల కోసం ఇంకా శిథిలాల వద్ద వెతుకులాట కొనసాగిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో భారీ యంత్రాలు లేకపోవడంతో ప్రజలే స్వచ్ఛందంగా శిథిలాలను తొలగిస్తూ మృతదేహాల కోసం అన్వేషిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
పెరిగిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..
ఇరాన్‌కు 24 గంటల గడువు.. హోర్ముజ్‌పై అమెరికా తుది హెచ్చరిక..