Share News

ఇరాన్ యుద్ధంపై జేడీ వాన్స్ విమర్శలు.. ట్రంప్ ఆగ్రహం..

ABN , Publish Date - Nov 19 , 2026 | 01:47 PM

అమెరికా మధ్యంతర ఎన్నికల తర్వాత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మధ్య విభేదాలు తలెత్తినట్లు వార్తలు వస్తున్నాయి. ఇరాన్‌తో యుద్ధం కారణంగానే రిపబ్లికన్ పార్టీ మధ్యంతర ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైందని వాన్స్ వ్యాఖ్యానించడంపై ట్రంప్ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.

ఇరాన్ యుద్ధంపై జేడీ వాన్స్ విమర్శలు.. ట్రంప్ ఆగ్రహం..
Donald Trump, JD Vance

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా మధ్యంతర ఎన్నికల తర్వాత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మధ్య విభేదాలు తలెత్తినట్లు వార్తలు వస్తున్నాయి. ఇరాన్‌తో యుద్ధం కారణంగానే రిపబ్లికన్ పార్టీ మధ్యంతర ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైందని వాన్స్ వ్యాఖ్యానించడంపై ట్రంప్ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. యుద్ధం వల్ల పార్టీకి రాజకీయంగా నష్టం జరిగినప్పటికీ.. ఇరాన్‌పై దాడి చేయడం సరైన నిర్ణయమని వాన్స్ సమర్థించాల్సిందని ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది (Trump Vance Rift).


అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి ఎదురైన పరాజయంపై జేడీ వాన్స్ ఇటీవల 'ఎక్స్‌'లో సుదీర్ఘ పోస్టు పెట్టారు. ఇరాన్‌తో యుద్ధమే పార్టీ ఓటమికి ప్రధాన కారణమని అందులో పేర్కొన్నారు. 2024లో ట్రంప్‌నకు ఓటు వేసిన చాలామంది ఈసారి డెమోక్రాట్లకు మద్దతు ఇచ్చారని వివరించారు. యుద్ధం వల్ల పెరిగిన ఇంధన ధరలు, ఆర్థిక పరిస్థితులపై ప్రజల్లో అసంతృప్తి రిపబ్లికన్లకు నష్టం కలిగించాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయామనే విషయంపై నిజాయితీగా చర్చించాలంటే ఇరాన్ యుద్ధం నుంచే ప్రారంభించాలని వాన్స్ వ్యాఖ్యానించారు (US Midterm Elections 2026).


ఈ వ్యాఖ్యలపై తొలుత స్పందించిన ట్రంప్.. వాన్స్ చెప్పిన విషయాల్లో చాలా వరకు నిజం ఉందని అంగీకరించారు. అయితే ఆ తర్వాత ఆయన వైఖరిలో మార్పు వచ్చినట్లు 'న్యూయార్క్ టైమ్స్' కథనం వెల్లడించింది. వాన్స్ వ్యాఖ్యలపై ట్రంప్ తన సన్నిహితులు, సహాయకుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేసినట్లు 'న్యూయార్క్ టైమ్స్' పేర్కొంది. ఇరాన్‌పై యుద్ధం కారణంగా ఎన్నికల్లో నష్టం జరిగిందని చెప్పడంతో పాటు, ఆ నిర్ణయం తీసుకోవడం సరైనదేనని కూడా వాన్స్ స్పష్టం చేయాల్సిందని ట్రంప్ భావిస్తున్నట్లు తెలిపింది (Trump Iran Policy).


వాన్స్‌పై అసంతృప్తితో ఉన్న ట్రంప్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో (Marco Rubio)ను ప్రశంసిస్తున్నారు. ఇరాన్‌పై సైనిక చర్యలను రూబియో బహిరంగంగా సమర్థిస్తున్నారు. ట్రంప్ కూడా తన సహాయకుల వద్ద రూబియో పనితీరును మెచ్చుకుంటున్నారని, భవిష్యత్తులో ఆయన మంచి అధ్యక్ష అభ్యర్థి కావచ్చని వ్యాఖ్యానించినట్లు 'న్యూయార్క్ టైమ్స్' కథనం పేర్కొంది. 2028 అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో వాన్స్, రూబియో ఇద్దరి పేర్లు రాజకీయ వర్గాల్లో చర్చకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రూబియోకు ట్రంప్ ఎక్కువ మద్దతు ఇస్తున్నట్టు కనిపిస్తోంది.


ఇవి కూడా చదవండి..

2035 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద మతంగా ఇస్లాం.. క్రైస్తవులను దాటేయనున్న ముస్లిం జనాభా..

గాజాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. హమాస్ ఆధీన ప్రాంతంలోకి ఇజ్రాయెల్ సైన్యం!

Updated Date - Nov 19 , 2026 | 01:54 PM