Share News

మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ పార్టీ ఓడిపోతే.. ఇరాన్‌పై భారీ దాడులకు వ్యూహం..?

ABN , Publish Date - Oct 31 , 2026 | 12:53 PM

ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారీ సైనిక చర్యకు దిగే అవకాశాలున్నాయనే వార్తలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి.

మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ పార్టీ ఓడిపోతే.. ఇరాన్‌పై భారీ దాడులకు వ్యూహం..?
Donald Trump Iran Attack

ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారీ సైనిక చర్యకు దిగే అవకాశాలున్నాయనే వార్తలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. నవంబర్ 3న జరగనున్న అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఘోరంగా ఓడిపోతే.. ఇరాన్‌పై ట్రంప్ పెద్ద ఎత్తున సైనిక ఆపరేషన్‌కు ఆదేశించే అవకాశం ఉందని ఓ మీడియా సంస్థ వెల్లడించింది (Donald Trump Iran Attack).


అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లు ఓడిపోతే ట్రంప్ మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉందని 'ఆక్సియోస్' ఓ నివేదిక వెలువరించింది. రాజకీయంగా అవమానానికి గురైనట్లు భావిస్తే ట్రంప్ ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకోవచ్చని ఓ అధికారి వ్యాఖ్యానించినట్లు పేర్కొంది. అయితే ఈ వాదనను వైట్‌హౌస్ అధికారి తోసిపుచ్చారు. ఎన్నికల ఫలితాలకు, ఇరాన్‌పై తమ నిర్ణయాలకు సంబంధం లేదని పేర్కొన్నారు. ఇరాన్‌పై మరోసారి పెద్ద ఎత్తున సైనిక చర్యలు చేపట్టేందుకు అమెరికా సైన్యం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు గతంలోనూ వార్తలు వచ్చాయి (Trump Iran Military Operation).


అధ్యక్షుడు ట్రంప్ ఆదేశిస్తే 96 గంటల్లోనే దాడులు ప్రారంభించే సామర్థ్యంతో బలగాలు సిద్ధంగా ఉన్నాయని అమెరికా అధికారులను ఉటంకిస్తూ సీబీఎస్, సీఎన్ఎన్ కథనాలు వెల్లడించాయి (US Midterm Elections 2026). ఇరాన్‌లోని సైనిక స్థావరాలు, అణు కేంద్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలు లక్ష్యంగా మారే అవకాశం ఉందని ఆ కథనాలు పేర్కొన్నాయి. అయితే ట్రంప్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని అధికారులు స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి..

ఢిల్లీ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. నలుగురి మృతి..


పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Oct 31 , 2026 | 12:57 PM