అమెరికా క్షిపణి నిల్వలు.. ట్రంప్,హెగ్సెత్ మధ్య విభేదాలు..
ABN , Publish Date - Aug 06 , 2026 | 04:21 PM
ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం అమెరికా అగ్రనాయకుల మధ్య విభేదాలకు కారణమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. గత నాలుగు నెలలుగా కొనసాగుతున్న యుద్ధం కారణంగా అమెరికా దీర్ఘశ్రేణి క్షిపణులు, వైమానిక రక్షణ వ్యవస్థలకు సంబంధించిన నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయని వార్తలు వచ్చాయి.
ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం అమెరికా అగ్రనాయకుల మధ్య విభేదాలకు కారణమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. గత నాలుగు నెలలుగా కొనసాగుతున్న యుద్ధం కారణంగా అమెరికా దీర్ఘశ్రేణి క్షిపణులు, వైమానిక రక్షణ వ్యవస్థలకు సంబంధించిన నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ మధ్య వాగ్వాదం జరిగిందని సమాచారం (Donald Trump, Pete Hegseth Rift).
తరిగిపోతున్న నిల్వలపై తనకు పూర్తి సమాచారం ఎందుకు ఇవ్వలేదని హెగ్సెత్‌పై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు అమెరికా మీడియాలో వార్తలు వచ్చాయి. ఆయుధాల కొరత సమస్య పరిష్కారమవుతుందని తాను భావించానని, కానీ ఎందుకు పరిష్కారం కాలేదో తనకు సమాధానం ఇవ్వాలని కూడా రక్షణ మంత్రిత్వ శాఖను ట్రంప్ ఆదేశించినట్టు సమాచారం. ఇరాన్ యుద్ధం మొదలైన నాటి నుంచి ట్రంప్, హెగ్సెత్ మధ్య పలు విషయాల్లో విభేదాలు కొనసాగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి (US Missile Stockpiles).
కాగా, అధ్యక్షుడు, రక్షణ మంత్రి మధ్య విభేదాలంటూ వచ్చిన వార్తలను వైట్‌హౌస్ ఖండించింది (Iran War, Pentagon). ఈ కథనం పూర్తిగా అసత్యమని, మీడియా ప్రచారం చేస్తున్న సమాచారం వాస్తవాలకు విరుద్ధమని వైట్‌హౌస్ స్పష్టం చేసింది. ట్రంప్-హెగ్సెత్ మధ్య ఎలాంటి ఘర్షణా జరగలేదని, అధ్యక్షుడికి అవసరమైన అన్ని భద్రతా వివరాలు క్రమం తప్పకుండా అందుతున్నాయని పేర్కొంది. అమెరికా సైనిక సామర్థ్యంపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి..
అత్యాచారం కేసు.. తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌కు పదేళ్ల జైలు..
హోర్ముజ్ తెరవడంపై ఇరాన్-ఒమన్ చర్చలు.. తగ్గిన ముడి చమురు ధరలు..