Share News

క్షిపణి దాడి మృతుల్లో భారతీయులు లేరు.. ఇండియన్ ఎంబసీ పోస్ట్

ABN , Publish Date - Mar 09 , 2026 | 04:10 PM

సౌదీ అరేబియాలోని నివాస ప్రాంతంలో సైనిక ప్రొజెక్టైల్ పడిపోవడంతో ఒక భారతీయుడు మృతి చెందినట్టు వచ్చిన వార్తలను రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం సోమవారంనాడు తోసిపుచ్చింది. అల్‌ ఖర్జ్ వద్ద జరిగిన దాడి ఘటనలో భారత్‌కు చెందిన వ్యక్తి ఎవరూ చనిపోలేదని వెల్లడించింది.

 క్షిపణి దాడి మృతుల్లో భారతీయులు లేరు.. ఇండియన్ ఎంబసీ పోస్ట్
missile strike on Riyadh

రియాద్: సౌదీ అరేబియాలోని నివాస ప్రాంతంలో సైనిక ప్రొజెక్టైల్ పడిపోవడంతో ఒక భారతీయుడు మృతి చెందినట్టు వచ్చిన వార్తలను రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం సోమవారంనాడు తోసిపుచ్చింది. అల్‌ ఖర్జ్ వద్ద జరిగిన దాడి ఘటనలో భారత్‌కు చెందిన వ్యక్తి ఎవరూ చనిపోలేదని వెల్లడించింది. ఈ మేరకు సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పోస్ట్ పెట్టింది.


అల్ ఖర్జ్ గవర్నరేట్‌పై సైనిక ప్రొజెక్టైల్ వచ్చి పడటంతో ఇద్దరు విదేశీయులు మరణించారని, వీరిలో ఒక భారతీయుడు, మరొక బంగ్లా దేశీయుడు ఉన్నట్టు సౌదీ సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ తొలుత సమాచారం ఇచ్చింది. అయితే తర్వాత స్పష్టత ఇచ్చింది. చనిపోయిన ఇద్దరు వ్యక్తులు బంగ్లాదేశీయులేనని తెలిపింది. గాయపడిన వారిలో ఒక భారతీయుడు ఉన్నట్టు తెలిపింది. దీనిపై రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం తాజాగా స్పందించింది. ఈ దురదృష్ట ఘటనలో భారత్‌కు చెందిన ఎవరూ చనిపోలేదని, ఈ ఘటనపై ఎప్పటికప్పుడు సౌదీ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపింది.


దాడి ఘటనలో భారత్‌కు చెందిన ఒక వ్యక్తి గాయపడ్డాడని, ప్రస్తుతం అల్‌ఖర్జ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో అతను చికిత్స పొందుతున్నాడని ఇండియన్ ఎంబసీ తెలిపింది. క్షతగాత్రుని కౌన్సిలర్ (సీడబ్ల్యూ) వై.సబీర్ పరామర్శించినట్టు ఆ పోస్టు తెలిపింది.


ఇవి కూడా చదవండి..

ట్రంప్‌ను చంపడానికి ఇరాన్ కుట్ర?.. ఆ రెండు ప్లాన్స్ ఫెయిల్..

అమెరికా ఆధిపత్య ధోరణి.. ఎన్ఆర్ఐల మౌనమెందుకు?

Updated Date - Mar 09 , 2026 | 04:16 PM