Share News

ఇరాన్ అధ్యక్ష కార్యాలయంపై దాడి.. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వెల్లడి

ABN , Publish Date - Mar 03 , 2026 | 07:08 PM

ఇరాన్ రాజధాని నగరం టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ దాడులను ఉధృతం చేసింది. సోమవారం రాత్రి పక్కా ఇంలెటిజెన్స్ సమాచారంతో టెహ్రాన్ నడిబొడ్డున ఉన్న పలు కీలక ప్రాంగణాలపై దాడులు జరిపామని, అధ్యక్ష కార్యాలయం, సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ భవనంపై బాంబులు జారవిడిచామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ తెలిపింది.

ఇరాన్ అధ్యక్ష కార్యాలయంపై దాడి.. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వెల్లడి
Iran presidential office

టెహ్రాన్: ఇరాన్ రాజధాని నగరం టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ దాడులను ఉధృతం చేసింది. సోమవారం రాత్రి పక్కా ఇంలెటిజెన్స్ సమాచారంతో టెహ్రాన్ నడిబొడ్డున ఉన్న పలు కీలక ప్రాంగణాలపై దాడులు జరిపామని, అధ్యక్ష కార్యాలయం, సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ భవనంపై బాంబులు జారవిడిచామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) తెలిపింది. ఇదే ఏరిపాయాలోని ఇరాన్ మిలటరీ అధికారులకు శిక్షణ ఇచ్చే సంస్థపైన, ఇతర మౌలిక సదుపాయాలపైన కూడా దాడి చేసినట్టు చెప్పింది.


కాగా, తమ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీతో పాటు పలువురు సైనిక ఉన్నతాధికారులను కోల్పోవడంతో ఇరాన్ సైతం ప్రతీకార దాడులు కొనసాగిస్తోంది. ఇజ్రాయెల్‌తో పాటు మధ్యప్రాచ్యంలోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్‌లతో దాడులు చేస్తోంది. రియాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయాన్ని ఇరాన్ డ్రోన్ ఒకటి మంగళవారంనాడు ఢీకొంది. దీంతో మంటలు చెలరేగాయి. అయితే స్వల్పనష్టమే జరిగినట్టు సౌదీ అరేబియా తెలిపింది. కువైట్‌లోని అమెరికా ఎంబసీని కూడా ఇరాన్ డ్రోన్ ఢీకొనడంతో తాత్కాలికంగా ఎంబసీని మూసివేశారు.


కాగా, ఇరాన్ దాడులపై ట్రంప్ మంగళవారంనాడు మరోసారి హెచ్చరికలు చేశాయి. సుదీర్ఘమైన దాడులకు తాము సిద్ధమని, తొలుత నాలుగు, ఐదు వారలు అనుకున్నప్పటికీ అంతకంటే ఎక్కువ రోజులు కొనసాగించే సత్తా కూడా తమకుందని చెప్పారు.


ఇవి కూడా చదవండి..

ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ కొత్త రక్షణ మంత్రి సైయద్ మాజిద్ అల్‌-రేజా మృతి

ఇరాన్‌లోని నటాంజ్ అణుశుద్ధి కేంద్రంపై దాడిని ధ్రువీకరించిన ఐఏఈఏ

Updated Date - Mar 03 , 2026 | 07:26 PM