పశ్చిమాసియాలో ఐటీ కంపెనీలకు ఇరాన్ హెచ్చరికలు
ABN , Publish Date - Mar 11 , 2026 | 03:39 PM
గల్ఫ్ ప్రాంతాల్లో భీకర యుద్ధం కొనసాగుతోంది. అమెరికా- ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా.. ఇరాన్ పశ్చిమాసియా దేశాలపై విరుచుకుపడుతుంది. ఈ క్రమంలోనే ఐటీ కంపెనీలకు ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: గల్ఫ్ ప్రాంతాల్లో భీకర యుద్ధం కొనసాగుతోంది. అమెరికా- ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా.. ఇరాన్ పశ్చిమాసియా దేశాలపై విరుచుకుపడుతుంది. ఈ క్రమంలో తాజాగా యూఏఈకి సంబంధించిన పోర్టులోని ఓ కంటైనర్ నౌక లక్ష్యంగా డ్రోన్ దాడి జరిగింది. ఇలా పలు ప్రాంతాల్లో ఇరాన్ డ్రోన్ దాడులు చేస్తూ.. గల్ఫ దేశాలను టెన్షన్ పెడుతుంది. ఇదే సమయంలో పశ్చిమాసియాలోని ఐటీ కంపెనీలకు ఇరాన్ హెచ్చరికలు కూడా జారీ చేసింది.
గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం, ఎన్విడియా, ఒరాకిల్ వంటి దిగ్గజ ఐటీ సంస్థలకు ఇరాన్ సైన్యం వార్నింగ్ ఇచ్చింది. పశ్చిమాసియాలో యుద్ధం విస్తరిస్తోందని, తమ ప్రత్యర్థులకు సహకరించే సంస్థలపై దాడులు తప్పవంటూ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(IRGC) హెచ్చరించింది. తమ మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తున్నారని, ప్రతిదాడులు తప్పవని ఐఆర్‌జీసీ వెల్లడించింది. ఐటీ, బ్యాంకు దిగ్గజ సంస్థలపై తాము దాడులు చేయడం సబబేనని, ఆయా సంస్థలకు కనీసం కి.మీ. పరిధిలో ఉండొద్దని ఐఆర్‌జీసీ ప్రజలకు సూచించింది. ఐఆర్‌జీసీ నిర్ణయాలను.. దాని అనుబంధ వార్తా సంస్థ తస్నిం న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.
మరోవైపు ఇవాళ దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఇరాన్ డ్రోన్ల దాడి చేసింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలు అయ్యాయని స్థానిక మీడియా తెలిపింది. దాడి జరిగినప్పటికీ ఎయిర్‌పోర్టు నుంచి విమానాల రాకపోకలు కొనసాగుతున్నాయి. డ్రోన్ దాడిలో గాయపడివ వారిలో ఒకరు భారతీయులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఇవి కూడా చదవండి:
క్షేమంగా ఉన్న ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా
హైదరాబాద్ నుంచి వెళ్లిన విమానానికి తప్పిన పెను ప్రమాదం