Share News

హైదరాబాద్ నుంచి వెళ్లిన విమానానికి తప్పిన పెను ప్రమాదం

ABN , Publish Date - Mar 11 , 2026 | 02:59 PM

హైదరాబాద్ నుంచి థాయిలాండ్ బయల్దేరిన ఎయిరిండియా విమానానికి (బోయింగ్ 737) ప్రమాదం తప్పింది. ఇవాళ(బుధవారం) ఫుకెట్ ఎయిర్ ఫోర్టులో ల్యాండ్ అయిన వెంటనే నోస్ వీల్ ఊడిపోయింది.

హైదరాబాద్ నుంచి వెళ్లిన విమానానికి తప్పిన పెను ప్రమాదం
Air India flight incident

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల కాలంలో తరచూ విమాన ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. సాంకేతిక సమస్య, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ తో సహా ఐదుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటే.. తాజాగా హైదరాబాద్ నుంచి బయలుదేరిన విమానంకి పెను ప్రమాదం తప్పింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం...


హైదరాబాద్ నుంచి థాయిలాండ్ బయల్దేరిన ఎయిరిండియా విమానానికి (బోయింగ్ 737) ప్రమాదం తప్పింది. ఇవాళ(బుధవారం) ఫుకెట్ ఎయిర్ ఫోర్టులో ల్యాండ్ అయిన వెంటనే నోస్ వీల్ (ఫ్రంట్ ల్యాండింగ్ గేర్) ఊడిపోయింది. దీంతో విమానం రన్ వే నుంచి పక్కకు జారింది. వెనుక టైర్ కూడా పేలిపోయింది. ఈ ఘటన జరిగిన సమయంలో విమానం తక్కువ వేగంతో ఉండటంతో భారీ ప్రమాదం తప్పింది. ఈ విమానంలో ఉన్న 133 మంది ప్రయాణికులు క్షేమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.


ఇవి కూడా చదవండి:

ఇతడిని పట్టిస్తే రూ. 9 కోట్లు మీవే.. యూఎస్ బంపర్ ఆఫర్

మొజ్తాబాను తన వారసుడిగా ఖమేనీ వ్యతిరేకించారా..

Updated Date - Mar 11 , 2026 | 03:31 PM