మొజ్తాబాను తన వారసుడిగా ఖమేనీ వ్యతిరేకించారా..
ABN , Publish Date - Mar 11 , 2026 | 11:07 AM
ఇజ్రాయెల్, అమెరికా చేసిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. దీంతో ఖమేనీ వారసుడిగా, ఆయన కుమారుడు మొజ్తాబా ఖమేనీ ఇరాన్ సుప్రీం లీడర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించినట్టు వార్తలు వస్తున్నాయి.
ఇజ్రాయెల్, అమెరికా చేసిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. దీంతో ఖమేనీ వారసుడిగా, ఆయన కుమారుడు మొజ్తాబా ఖమేనీ ఇరాన్ సుప్రీం లీడర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే మొజ్తాబాను తన వారసుడిగా, ఇరాన్ సుప్రీం లీడర్‌గా ప్రకటించడాన్ని ఎన్నో ఏళ్ల క్రితమే అయతొల్లా అలీ ఖమేనీ వ్యతిరేకించినట్టు 'న్యూయార్క్ పోస్ట్' ఓ కథనం ప్రచురించింది (Ali Khamenei successor debate).
మొజ్తాబా తన స్థానంలోకి రాకూడదని ఖమేనీ స్పష్టంగా పేర్కొన్నారని 'న్యూయార్క్ పోస్ట్' వెల్లడించింది. మొజ్తాబా అనుభవం లేనివాడని, రాజకీయ నాయకుడికి ఉండాల్సిన పరిణితి అతడికి లేదని, ఇరాన్‌ను నడిపించలేడని ఖమేనీ భావించడమే అందుకు కారణమట. అయితే మొజ్తాబాకు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)పై మాత్రం పూర్తి పట్టు ఉంది. అందువల్లే అంతర్గతంగానూ, ఇతర దేశాల్లోనూ వ్యతిరేకత ఉన్నప్పటికీ ఐఆర్‌జీసీ మద్దతుతోనే సుప్రీం లీడర్‌గా మొజ్తాబా నియమితులయ్యారట (Iran Supreme Leader succession).
అనేక మంది మతాధికారులు మొజ్తాబాకు వ్యతిరేకంగా ఓటు వేశారని, ఆయనకు తగినంత మెజారిటీ రాలేదని, కానీ ఐఆర్‌జీసీ ఒత్తిడితోనే ఆయన అధికారంలోకి వచ్చారని 'న్యూయార్క్ పోస్ట్' పేర్కొంది. 56 ఏళ్ల మొజ్తాబా ఇంతకు ముందు ఎప్పుడూ అధికారికంగా ప్రభుత్వ పదవిని నిర్వహించలేదు. అయితే తండ్రి పాలనకు, ఆయన సాంప్రదాయవాద విధానాలకు మద్దతు ఇవ్వడానికి దశాబ్దాలుగా తెర వెనుక పనిచేశారు (IRGC role Iran leadership).
ఇజ్రాయెల్ దాడిలో మొజ్తాబా కూడా గాయపడినట్టు వార్తలు వచ్చాయి (Iran leadership controversy). ఆ దాడిలో అతడి భార్య, కొడుకు, తల్లి మరణించారు. కాగా, ఇరాన్ నూతన సుప్రీం లీడర్ అయిన మొజ్తాబాను కూడా టార్గెట్ చేసినట్టు ఇజ్రాయెల్ ఇప్పటికే ప్రకటించింది. ఉగ్రవాద పాలనను ప్రోత్సహించే ఏ ఇరాన్ నాయకుడినైనా బహిరంగంగా లక్ష్యంగా చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు.
ఇవి కూడా చదవండి..
ఇరాన్‌లో నల్లటి వర్షం.. ఇది ఎంత ప్రమాదకరమంటే..
బంగారం, వెండి ధరల్లో స్వల్ప పెరుగుదల.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..