సుదీర్ఘ యుద్ధానికి సిద్ధం... ఇరాన్ సుప్రీం లీడర్ సలహాదారు కమల్ ఖరాజీ
ABN , Publish Date - Mar 10 , 2026 | 08:26 PM
అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇరాన్ విదేశీ వ్యవహారాల వ్యూహాత్మక మండలి సలహాదారు కమల్ ఖారాజీ కీలక వ్యాఖ్యలు చేశారు. దౌత్య భాష అమెరికాకు తెలియదని, ఆ దేశంతో సుదీర్ఘ యుద్ధానికి ఇరాన్ ఆర్మీ సిద్ధంగా ఉందని ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు.
టెహ్రాన్ : అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇరాన్ విదేశీ వ్యవహారాల వ్యూహాత్మక మండలి సలహాదారు కమల్ ఖారాజీ (Kamal Kharraji) కీలక వ్యాఖ్యలు చేశారు. దౌత్య భాష అమెరికాకు తెలియదని, ఆ దేశంతో సుదీర్ఘ యుద్ధానికి ఇరాన్ ఆర్మీ సిద్ధంగా ఉందని 'సీఎన్ఎన్'కు ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు.
'ఇకపై చర్చలకు అవకాశం ఉంటుందని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ట్రంప్‌నకు మోసం చేయడం ఎలాగో బాగా తెలుసు. ఇచ్చిన వాగ్దానాలను నిలుపుకోవడం తెలియదు. సంప్రదింపులు జరుగుతుండగానే రెండుసార్లు యుద్ధానికి దిగారు. గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాల యుద్ధానికి ఇరాన్ సిద్ధమవుతోంది' అని ఖరాజీ తెలిపారు. ఆర్థిక ఒత్తిళ్ల తీవ్రమై ఇతర దేశాలు కాల్పుల విరమణ జరపాలంటూ ఒత్తిడి తేస్తేనే కానీ యుద్ధం ముగుస్తుందని తాను అనుకోవడం లేదని చెప్పారు. గల్ఫ్ దేశాలు, ఇతర దేశాలు యుద్ధాన్ని ముగించాలని అమెరికాపై ఒత్తిడి తీసుకురావాలన్నారు.
యుద్ధం వల్ల ఆర్థిక ఒత్తిళ్లు పెరుగుతాయని, దవ్యోల్బణం పెరిగి, ఇంధన కొరత ఏర్పడుతుందని ఆయన విశ్లేషించారు. ఇదే పరిస్థితి కొనసాగితే అందరిపైనా ఒత్తిడి పెరుగుతుందని, అప్పుడు ఇతరులు జోక్యం చేసుకోవడం తప్పనిసరవుతుందని అన్నారు. మరోవైపు, ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం త్వరలో ముగిసే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. యుద్ధంతో పెరుగుతున్న ఖర్చులు, తరుగుతున్న ఆయుధ నిల్వలు, ఎదురవుతున్న నష్టాలను దృష్టిలో ఉంచుకుని ట్రంప్ తాజా వ్యాఖ్యలు చేసినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
నౌకల స్వాధీనం కంటే ముంచేయడమే సరదాగా ఉంటుంది.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
డ్రోన్ల తయారీ వ్యాపారంలో ట్రంప్ తనయుల పెట్టుబడులు