యుద్ధం ఆపేయండి.. ట్రంప్‌నకు సలహాదారుల సూచన
ABN , Publish Date - Mar 10 , 2026 | 01:22 PM
ఇరాన్‌తో యుద్ధం ఆపేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు సలహాదారులు సూచించినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమచారం ప్రకారం.. యుద్ధం ఎక్కువ రోజులు కొనసాగటం వల్ల నష్టాలు తప్పవని కొంతమంది ట్రంప్ సలహాదారులు భావిస్తున్నారు.
న్యూయార్క్, మార్చి 10: ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య యుద్ధం 11వ రోజుకు చేరుకుంది. యుద్ధ ప్రభావం ప్రపంచ దేశాలపై పడుతోంది. ఆయిల్ ధరలు పెరుగుతూ పోతున్నాయి. ఇలాంటి సమయంలో ఇరాన్‌తో యుద్ధం ఆపేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు సలహాదారులు సూచించినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. యుద్ధం ఎక్కువ రోజులు కొనసాగటం వల్ల నష్టాలు తప్పవని కొంతమంది ట్రంప్ సలహాదారులు భావిస్తున్నారు. యుద్ధం నుంచి వీలైనంత త్వరగా అమెరికా వెనక్కు రావటం ఉత్తమమని అంటున్నారు.
సైన్యం తన లక్ష్యాలను దాదాపుగా సాధించిందని పేర్కొంటూ యుద్ధం నుంచి బయటకు రావాలని ట్రంప్‌నకు సూచించారు. ఇరాన్‌తో యుద్ధాన్ని ట్రంప్ రాజకీయ మద్దతుదారులు కొంతమంది సమర్థిస్తున్నారు. అయితే, రానున్న రోజుల్లో వీరిలో కూడా చాలా మంది యుద్ధాన్ని వ్యతిరేకించే అవకాశం ఉందని సలహాదారులు ట్రంప్‌నకు వివరించారు. ప్రజాభిప్రాయ సేకరణకు సంబంధించిన వివరాలను కూడా ట్రంప్‌నకు తెలియజేశారు. సలహాదారుల సూచనల నేపథ్యంలో ట్రంప్ ఆలోచనల్లో పడ్డారట. కాగా, ఇటీవలి రోజుల్లో విడుదలైన బహిరంగ సర్వేల ప్రకారం.. మెజారిటీ అమెరికన్లు ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది.
మొజ్తాబా ఎంపికపై ట్రంప్ ఆగ్రహం..
ఇరాన్ సుప్రీం లీడర్‌గా మొజ్తాబాను ఎంపిక చేయడంపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన స్పందిస్తూ.. ‘సుప్రీం లీడర్‌గా మొజ్తాబా ఖమేనీని ఎంపిక చేసి ఇరాన్ పెద్ద తప్పు చేసింది. మొజ్తాబా ఖమేనీ ఎంతకాలం పదవిలో కొనసాగుతారో తెలియదు. ఇరాన్‌పై యుద్ధం త్వరలో ముగుస్తుంది. ఇరాన్‌కు ఇప్పుడు నేవీ, ఎయిర్‌ఫోర్స్ కమ్యూనికేషన్లు లేవు. ఇప్పటివరకు 5 వేల లక్ష్యాలను ఛేదించాం. ఇరాన్ యుద్ధంపై పుతిన్‌తో మాట్లాడా. యుద్ధం పట్ల పుతిన్ సంతృప్తిగానే ఉన్నారు’ అని ట్రంప్ అన్నారు.
ఇవి కూడా చదవండి
ఏపీలో ఎండ తీవ్రతపై హోం మంత్రి అనిత సమీక్ష.. కీలక ఆదేశాలు