Share News

డ్రోన్ల తయారీ వ్యాపారంలో ట్రంప్ తనయుల పెట్టుబడులు

ABN , Publish Date - Mar 10 , 2026 | 06:54 PM

దేశీయంగా మిలట్రీ-గ్రేడ్ డ్రోన్ల ఉత్పత్తికి అమెరికా ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్న క్రమంలో దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారులు డ్రోన్ల తయారీ వ్యాపారంలో పెట్టుబడులు పెడుతున్నారు.

డ్రోన్ల తయారీ వ్యాపారంలో ట్రంప్ తనయుల పెట్టుబడులు
Eric Trump and Donald Trump Jr

వాషింగ్టన్: దేశీయంగా మిలట్రీ-గ్రేడ్ డ్రోన్ల ఉత్పత్తికి అమెరికా ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్న క్రమంలో దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారులు డ్రోన్ల తయారీ వ్యాపారంలో పెట్టుబడులు పెడుతున్నారు. కొత్తగా ఏర్పాటయిన 'పవరస్ కార్పొరేషన్' డ్రోన్ల తయారీ సంస్థలో ఎరిక్ ట్రంప్, ట్రంప్ జూనియర్‌లు ప్రధాన వాటాదారులుగా చేరినట్టు ఆ సంస్థ తాజాగా తెలిపింది. మిటలరీ, పౌర అవసరాలకు ఉపయోగపడే డ్రోన్లను ఈ కంపెనీ తయారు చేస్తోంది.


ఫ్లోరిడాలోని టంపాలో గత ఏడాది ప్రారంభమైన డ్రోన్ల తయారీ సంస్థ 'ఎక్స్‌టెండ్' (Xtend)లోనూ ఎరిక్ ట్రంప్ పెట్టుబడిదారుగా ఉన్నారు. భవిష్యత్తులో వేవ్ అంతా డ్రోన్లదేనని, సురక్షిత అమెరికా కోసం కంపెనీ అందిస్తున్న సేవలకు గర్విస్తున్నానని ఎరిక్ ట్రంప్ గతవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 'అన్‌యూజువల్ మెషిన్స్' అనే డ్రోన్ తయారీ స్టార్టప్‌లోనూ ట్రంప్ జూనియర్ 2024 నవంబర్‌లో పెట్టుబడులు పెట్టారు. ఈ సంస్థ ఇప్పటికే గవర్నమెంట్ కాంట్రాక్టులు సాధించింది. ట్రంప్ ప్రభుత్వం జాతీయ భద్రతా ఆందోళనలను దృష్టిలో పెట్టుకుని విదేశీ తయారీ డ్రోన్లు, క్రిటికల్ కాంపొనెంట్లపై గత డిసెంబర్‌లో నిషేధం విధించింది. దీనిలో గ్లోబల్ మార్కెట్‌లో కీలకంగా ఉన్న చైనా తయారు చేసే కమ్యూనికేషన్స్ అండ్ వీడియో నిఘా సామాగ్రి కూడా ఉంది.


కాగా, ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్‌ జరుపుతున్న తాజా దాడుల్లో తొలిసారిగా వన్-వే డ్రోన్లను పెంటగాన్ వాడినట్టు యూఎస్ సెంట్రల్ కమాంట్ (CENTCOM) తెలిపింది. యుద్ధ సమయాల్లో ఈ డ్రోన్లు గణనీయపాత్రను పోషించగలవని నిరూపణ అయినట్టు పేర్కొంది. లక్ష్యాన్ని ఢీకొట్టి పేలిపేయే తక్కువ ఖర్చుతో కూడిన ఆత్మహుతి ఆయుధాలను 'వన్ వే డ్రోన్లు'గా పిలుస్తుంటారు.


ఇవి కూడా చదవండి...

నౌకల స్వాధీనం కంటే ముంచేయడమే సరదాగా ఉంటుంది.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

యుద్ధం ఆపేయండి.. ట్రంప్‌నకు సలహాదారుల సూచన

Updated Date - Mar 10 , 2026 | 07:20 PM