Share News

త్వరలోనే ఇరాన్ యుద్ధం ముగుస్తుంది.. ఆయిల్ ధరలు తగ్గుతాయి: ట్రంప్

ABN , Publish Date - Mar 10 , 2026 | 11:44 AM

ప్రపంచ దేశాలను తీవ్ర అసౌకర్యానికి గురి చేస్తున్న ఇరాన్ యుద్ధం త్వరలోనే ముగుస్తుందని, చమురు ధరలు కిందకు దిగి వస్తాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్‌ విషయంలో తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడానికి చేరువలో ఉన్నామన్నారు.

త్వరలోనే ఇరాన్ యుద్ధం ముగుస్తుంది.. ఆయిల్ ధరలు తగ్గుతాయి: ట్రంప్
Donald Trump about Iran war

ఇరాన్ యుద్ధం త్వరలోనే ముగుస్తుందని, చమురు ధరలు కిందకు దిగి వస్తాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్‌ విషయంలో తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడానికి చేరువలో ఉన్నామని, యుద్ధానికి త్వరలోనే ముగింపు దొరుకుతుందని అన్నారు. ఇరాన్‌పై దాడిని, మధ్యప్రాచ్యంలోని చెడును వదిలించడానికి అమెరికా చేసిన విహారయాత్రగా ట్రంప్ అభివర్ణించారు. ఆ విహారయాత్ర స్వల్పకాలికంగానే ఉంటుందని తెలిపారు (Donald Trump Iran war).


మియామి గోల్ఫ్ క్లబ్‌లో రిపబ్లికన్ చట్ట సభ్యులతో జరిగిన సమావేశంలో ట్రంప్ ప్రసంగించారు. 'ఇరాన్ యుద్ధం ఈ వారంలోనే ముగుస్తుందా' అనే ప్రశ్నకు ట్రంప్ స్పందిస్తూ.. 'లేదు. కానీ త్వరలోనే ముగుస్తుంది' అని జవాబిచ్చారు. 'మా సైనిక లక్ష్యాన్ని పూర్తి చేసే దిశగా పెద్ద అడుగులు వేస్తున్నాం. ఇరాన్‌లోని బలగాలను పూర్తిగా తుడిచిపెట్టేశాం. అంతర్జాతీయ చమురు సరఫరాకు అంతరాయం కలిగిస్తే ఉపేక్షించేది లేదు. అలా చేస్తే ఇరాన్‌ను పూర్తిగా ధ్వంసం చేస్తాం' అని ట్రంప్ హెచ్చరించారు (Oil prices fall prediction).


అమెరికా, ఇజ్రాయెల్‌పై దాడిని పొడిగించేందుకు ఇరాన్‌కు తగినంత సామర్థ్యం లేదు కాబట్టి, యుద్ధం త్వరలోనే ముగిసిపోతుందని ట్రంప్ పేర్కొన్నారు (US Iran war updates). అమెరికా-ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించడంతో ఆయన వారసుడిగా మొజ్తాబా ఖమేనీ ఎంపికైనట్టు వార్తలు వస్తున్నాయి. ఇరాన్ నూతన సుప్రీం లీడర్‌గా మొజ్తాబాను ఎంపిక చేయడం పట్ల తాను చాలా నిరాశ చెందానని, అయితే కొత్త సుప్రీం లీడర్‌‌పై దాడి చేసే ఉద్దేశం తనకు లేదని ట్రంప్ తెలిపారు.


ఇవి కూడా చదవండి..

ఇరాన్ యుద్ధం.. పెట్రోల్, గ్యాస్, ఎరువుల నిల్వలు సరిపోతాయా..

పుతిన్‌కు ట్రంప్ ఫోన్ కాల్.. ఇరాన్ యుద్ధం గురించి చర్చ..

Updated Date - Mar 10 , 2026 | 11:47 AM