అమెరికా దిగ్బంధనం.. ఇరాన్‌కు రూ.45 వేల కోట్ల నష్టం..
ABN , Publish Date - May 02 , 2026 | 12:26 PM
అమెరికా నౌకా దిగ్బంధనం కారణంగా ఇరాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పోర్టులను, నౌకల రవాణాను అమెరికా దిగ్బంధించిన కారణంగా ఇరాన్‌కు భారీ ఆర్థిక నష్టం వాటిల్లినట్లు పెంటగాన్ అంచనా వేసింది.
వాషింగ్టన్: అమెరికా నౌకా దిగ్బంధనం కారణంగా ఇరాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పోర్టులను, నౌకల రవాణాను అమెరికా దిగ్బంధించిన కారణంగా ఇరాన్‌కు భారీ ఆర్థిక నష్టం వాటిల్లినట్లు పెంటగాన్ అంచనా వేసింది. అమెరికా దిగ్బంధనం కారణంగా ఇరాన్ దాదాపు 4.8 బిలియన్ డాలర్లు (రూ.45 వేల కోట్లు) కోల్పోయినట్టు వెల్లడించింది (Iran US blockade).
హోర్ముజ్ జలసంధి సమీపంలో అమెరికా దిగ్బంధనం ఏప్రిల్ 13వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. అప్పట్నుంచి చమురుతో సహా ఇతర సరుకులను రవాణా చేసేందుకు ప్రయత్నించిన 40కి పైగా నౌకలను అమెరికా దళాలు దారి మళ్లించాయని పెంటగాన్ తెలిపింది. సుమారు 53 మిలియన్ బ్యారెళ్ల చుమురును తీసుకెళ్తున్న ఇరాన్‌కు చెందిన 31 ట్యాంకర్లు గల్ఫ్‌లోనే నిలిచిపోయాయని పేర్కొంది. ఇందువల్లే ఇరాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైందని తెలిపింది (Strait of Hormuz crisis).
కాగా, నౌకా దిగ్బంధనంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు (US Iran tensions 2026). 'నౌకలను సీజ్ చేయడం, చమురును స్వాధీనం చేసుకోవడం అత్యంత లాభసాటి వ్యాపారంలా కనిపిస్తోంది. మేం సముద్రపు దొంగల్లాంటి వాళ్లం. వారితో మేం ఆటలు ఆడడం లేదు. దిగ్బంధనం విషయంలో మేం చాలా సీరియస్‌గా ఉన్నాం' అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి..
ఒప్పందం కుదరకపోతే ఇతర మార్గాలు.. ఇరాన్‌ను హెచ్చరించిన ట్రంప్..
బంగారం కొనాలనుకుంటున్నారా.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..