బహ్రెయిన్‌పై ఇరాన్ దాడి.. 21 మంది అమెరికా సైనికులు మృతి
ABN , Publish Date - Mar 08 , 2026 | 03:08 PM
ఇరాన్ తాజాగా బహ్రెయిన్ రాజధాని మేనామలోని జుఫైర్ జిల్లాలోని అమెరికా నావికాదళానికి చెందిన 5వ ఫ్లీట్ ప్రధానకార్యాలయంపై క్షిపణులు, డ్రోన్‌లతో విరుచుకుపడింది. ఈ దాడిలో 21 మంది అమెరికా సైనికులు మృతి చెందినట్టు టెహ్రాన్ టైమ్స్ తెలిపింది.
టెహ్రాన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఇరాన్‌పై విరుచుకుపడుతుంటే, ఇరాన్ సైతం ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులు కొనసాగిస్తోంది. ఇరాన్ తాజాగా బహ్రెయిన్ రాజధాని మేనామలోని జుఫైర్ జిల్లాలోని అమెరికా నావికాదళానికి చెందిన 5వ ఫ్లీట్ ప్రధానకార్యాలయంపై క్షిపణులు, డ్రోన్‌లతో విరుచుకుపడింది. ఈ దాడిలో 21 మంది అమెరికా సైనికులు మృతి చెందినట్టు 'టెహ్రాన్ టైమ్స్' తెలిపింది. దాడి అనంతరం పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడినట్టు తెలిపింది. ఉపగ్రహ ఛాయాచిత్రాలు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి.
'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' పేరుతో యుఎస్-ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులకు ప్రతిగా ఇరాన్ ఈ ప్రతిదాడులు సాగిస్తోంది. మార్చి 6న హిందూ మహాసముద్రంలో ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా సబ్‌మెరైన్ దాడి చేయడంతో 87 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి.
5వ ఫ్లీట్ వ్యూహాత్మక పాత్ర
బహ్రెయిన్ ప్రధాన కేంద్రంగా పనిచేసే అమెరికా నావికాదళ విభాగం యూఎఎస్ నేవీ 5వ ఫ్లీట్. ఇది పెర్షియన్ గల్ఫ్, ఎర్ర సముద్రం, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రంలోని కొన్ని ప్రాంతాల్లో సుమారు 2.5 మిలియన్ చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉంది. భద్రత, స్థిరత్వం, వాణిజ్య నౌకల స్వేచ్ఛా సంచారాన్ని పర్యవేక్షిస్తోంది.
ఇవి కూడా చదవండి..
అంతర్జాతీయంగా ఒత్తిడి తగ్గించేందుకే.. భారత్‌కు అనుమతిపై ట్రంప్ వివరణ..
అతడెవరో కూడా తెలియదు, ఆ హెచ్చరికలను లెక్కచేయను: ట్రంప్