Share News

అంతర్జాతీయంగా ఒత్తిడి తగ్గించేందుకే.. భారత్‌కు అనుమతిపై ట్రంప్ వివరణ..

ABN , Publish Date - Mar 08 , 2026 | 10:39 AM

రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు భారత్‌కు తాత్కాలిక మినహాయింపునిస్తూ అమెరికా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయొద్దంటూ కొన్ని నెలల పాటు భారత్‌తో వాణిజ్య యుద్ధానికి దిగిన అమెరికా.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ యూటర్న్ తీసుకుంది.

అంతర్జాతీయంగా ఒత్తిడి తగ్గించేందుకే.. భారత్‌కు అనుమతిపై ట్రంప్ వివరణ..
Donald Trump oil market statement

రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు భారత్‌కు తాత్కాలిక మినహాయింపునిస్తూ అమెరికా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయొద్దంటూ కొన్ని నెలల పాటు భారత్‌తో వాణిజ్య యుద్ధానికి దిగిన అమెరికా.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ యూటర్న్ తీసుకుంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు భారత శుద్ధి కర్మగారాలకు నెల రోజుల పాటు అనుమతినిచ్చింది (Trump oil markets).


ఈ అంశం గురించి తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివరణ ఇచ్చారు. 'యుద్ధం వల్ల పశ్చిమాసియాలో సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ప్రపంచ దేశాల్లోని ఇంధన మార్కెట్లపై ఒత్తిడిని తగ్గించడం కోసమే రష్యా నుంచి చమురు కొనుగోలుకు భారత్‌కు అనుమతి ఇచ్చాం. దీని వల్ల రష్యాకు ఎలాంటి ఆర్థిక ప్రయోజనమూ లభించదు. ఎందుకంటే సముద్రంలో ఇప్పటికే ఉన్న రష్యా ముడి చమురును కొనేందుకే భారత్‌కు మినహాయింపు ఇచ్చాం' అని ట్రంప్ పేర్కొన్నారు (Global oil prices tension).


భారత్ తమకు ముఖ్యమైన భాగస్వామి అని, ఇంధన మార్కెట్లను స్థిరీకరించడానికి అదనపు చర్యలు తీసుకుంటున్నామని ట్రంప్ అన్నారు (Oil supply crisis). ప్రస్తుత పరిస్థితుల్లో కొంత మేర ఒత్తిడి తగ్గించడం గురించి మాత్రమే తాను ఆలోచిస్తున్నానని తెలిపారు. ఉద్రిక్తతల కొనసాగుతున్నప్పటికీ ప్రపంచ చమురు సరఫరా బలంగానే ఉందని, అమెరికా వద్ద భారీ నిల్వలు ఉన్నాయని అన్నారు.


ఇవి కూడా చదవండి..

రూ.30 లక్షల లాటరీ.. ఎక్కడున్నాడో తెలియని విజేత.. ఏం చేస్తున్నారంటే..


స్థిరంగా వెండి, బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Mar 08 , 2026 | 11:24 AM