ఎఫ్‌బీఐ చీఫ్ కాష్ పటేల్ ఈమెయిల్‌ను హ్యాక్ చేరిన ఇరాన్
ABN , Publish Date - Mar 27 , 2026 | 08:47 PM
ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ కాష్ పటేల్ వ్యక్తిగత ఈమెయిల్ హ్యాక్ అయింది. తామే ఈ హ్యాకింగ్‌కు పాల్పడినట్టు ఇరాన్‌కు చెందిన హండాలా హ్యాక్ టీమ్ ప్రకటించింది.
టెహ్రాన్: ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(FBI) డైరెక్టర్ కాష్ పటేల్(Kash Patel) వ్యక్తిగత ఈమెయిల్ హ్యాక్ అయింది. తామే ఈ హ్యాకింగ్‌కు పాల్పడినట్టు ఇరాన్‌కు చెందిన హండాలా హ్యాక్ టీమ్ ప్రకటించింది. పటేల్ వ్యక్తిగత ఇన్‌బాక్స్ నుంచి ఫొటోలు, రెస్యూమెను హ్యాకర్లు ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశారు. ఈ దాడుల్లో 2010-2019 మధ్య కాలం నాటి కాష్ పటేల్ వ్యక్తిగత, వృత్తిపరమైన ఈమెయిల్స్, ఫొటోలు హ్యాక్ అయినట్టు తెలుస్తోంది.
కాగా, ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ ఈమెయిల్ హ్యాక్ అయిన విషయాన్ని యూఎస్ జస్టిస్ డిపార్ట్‌మెంట్ అధికారి ఒకరు ధ్రువీకరించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్టు చెప్పారు.
ఇవి కూడా చదవండి..
ఆ విషయంపై ఇరాన్ సీరియస్.. గల్ఫ్ దేశాలకు వార్నింగ్!
ఇరాన్‌పై మరో 10 రోజులపాటు దాడులకు బ్రేక్: ట్రంప్