ఇరాన్‌తో చర్చలకు రమ్మంటే వస్తా: డొనాల్డ్ ట్రంప్
ABN , Publish Date - Apr 21 , 2026 | 02:39 PM
పశ్చిమాసియాలోని ఉద్రిక్తతల నేపథ్యంలో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్ నాయకత్వంతో నేరుగా సంప్రదింపులు జరిపేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచనప్రాయంగా పేర్కొన్నారు.
పశ్చిమాసియాలోని ఉద్రిక్తతల నేపథ్యంలో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్ నాయకత్వంతో నేరుగా సంప్రదింపులు జరిపేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచనప్రాయంగా పేర్కొన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ట్రంప్.. ఇరాన్‌తో శాంతి చర్చల గురించి మాట్లాడారు (Trump Iran talks).
'వారు కలవాలనుకుంటే.. మా దగ్గర చాలా మంది సమర్థులైన వ్యక్తులు ఉన్నారు. ఒకవేళ వారు నేరుగా నన్నే కలవాలనుకున్నా నాకు అభ్యంతరం లేదు. ఇరాన్ నేతలను కలిసి శాంతి చర్చల గురించి మాట్లాడేందుకు నేను సిద్ధమే' అని ట్రంప్ ప్రకటించారు. నేరుగా కాకపోయినా వర్చువల్‌గా అయినా ట్రంప్ పాల్గొనే అవకాశం ఉన్నట్టు సమాచారం. కాగా, ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించే అవకాశం ఉందని అమెరికా మాజీ సీఐఏ చీఫ్ డేవిడ్ హెచ్ పెట్రయాస్ అభిప్రాయపడ్డారు (US Iran direct talks).
కాగా, పాకిస్థాన్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య రెండో దఫా శాంతి చర్చలు జరుగుతాయా, లేదా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది (Iran US conflict). అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమపై బెదిరింపులకు పాల్పడుతున్న నేపథ్యంలో.. వారితో చర్చలకు అంగీకరించే ప్రసక్తే లేదని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ ఘాలిబఫ్ అన్నారు. తమ నౌకల రవాణాపై దిగ్బంధనం విధించిన ట్రంప్ ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలను దెబ్బ తీశారని అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ 2026: ఒకే సెంచరీ.. పలు రికార్డులు బద్దలు
ఐపీఎల్ 2026: తొలి సెంచరీపై తిలక్ వర్మ కీలక వ్యాఖ్యలు