టీమిండియా బిజీ షెడ్యూల్.. బీసీసీఐపై గంభీర్, శుభ్‌మన్ గిల్ అసంతృప్తి!
ABN , Publish Date - Apr 21 , 2026 | 02:27 PM
ఐపీఎల్ 2026 ఉత్సాహభరితంగా కొనసాగుతోంది. మే 31న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఉండనుంది. దాని తర్వాత భారత జట్టు వరుస సిరీస్‌లతో బిజీగా మారనుంది. కాస్త కూడా తీరిక లేకుండా షెడ్యూల్ రూపొందించిన బీసీసీఐపై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, టెస్టు, వన్డేల కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 ఉత్సాహభరితంగా కొనసాగుతోంది. మే 31న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఉండనుంది. దాని తర్వాత భారత జట్టు వరుస సిరీస్‌లతో బిజీగా మారనుంది. కాస్త కూడా తీరిక లేకుండా షెడ్యూల్ రూపొందించిన బీసీసీఐపై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. జూన్ 6 నుంచి 10 వరకు ముల్లాన్‌పుర్‌లో భారత జట్టు అఫ్గానిస్థాన్‌పై టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ మ్యాచుకు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్లతో సంబంధం లేదు. దీంతో అగ్రశేణి ప్లేయర్లకు విశ్రాంతినిచ్చి యువ ఆటగాళ్లను బరిలోకి దింపాలని టీమ్ మేనేజ్‌మెంట్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
సీనియర్ ప్లేయర్లు బుమ్రా, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలకు రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో రాణించిన గుర్నూర్ బ్రార్, మానవ్ సుతార్, ఆకిబ్ నబీ దార్, దేవదత్ పడిక్కల్ వంటి ఆటగాళ్లను అఫ్గానిస్థాన్‌తో టెస్టు మ్యాచ్‌కు ఎంపిక చేసే ఛాన్స్ ఉన్నట్టు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఐపీఎల్ 2026 ముగియగానే టీమిండియా వరుస సిరీస్‌లతో తీరిక లేకుండా గడపనుంది. జూన్‌లో అఫ్గానిస్థాన్‌తో టెస్ట్ మ్యాచ్, మూడు వన్డేలు ఆడనుంది. తర్వాత ఐర్లాండ్ పర్యటనకు వెళ్లి అక్కడ రెండు టీ20లు ఆడనుంది. జులైలో ఇంగ్లండ్‌లో పర్యటించి ఆతిథ్య జట్టుతో ఐదు వన్డేలు, మూడు టీ20ల్లో తలపడనుంది. జులై 23 నుంచి జింబాబ్వే, టీమిండియా మధ్య మూడు టీ20ల సిరీస్ జరగనుంది.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ 2026: ఒకే సెంచరీ.. పలు రికార్డులు బద్దలు
ఐపీఎల్ 2026: తొలి సెంచరీపై తిలక్ వర్మ కీలక వ్యాఖ్యలు