Share News

వారిని అంతం చేస్తాను.. ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక

ABN , Publish Date - Mar 13 , 2026 | 01:42 PM

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏ మాత్రం చల్లారడం లేదు. అమెరికా- ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం మరింత ఎక్కువ అవుతోంది. ఇజ్రాయెల్, ఇరాన్ పరస్పర దాడులతో గల్ఫ్ ప్రాంతం రావణ కాష్ఠాన్ని తలపిస్తోంది

వారిని అంతం చేస్తాను.. ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక
Donald Trump Iran warning

ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏ మాత్రం చల్లారడం లేదు. అమెరికా- ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం మరింత ఎక్కువ అవుతోంది. ఇజ్రాయెల్, ఇరాన్ పరస్పర దాడులతో గల్ఫ్ ప్రాంతం రావణకాష్ఠాన్ని తలపిస్తోంది. వేలాది మంది మరణించారు. ఈ క్రమంలో ఇప్పటికే పలుమార్లు ఇరాన్ ను హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కూడా వార్నింగ్ ఇచ్చారు.


ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ..' పిచ్చిగా ప్రవర్తించే ఇరాన్ నేతలు ఏం జరుగుతుందో త్వరలో చూస్తారు. మా సైనికులు చేసిన దాడిలో ఇరాన్ నౌకాదళం ఆనవాళ్లు లేకుండా పోయింది. ఇకపై ఇరాన్ వైమానికదళం కూడా ఉండదు. 47 ఏళ్లుగా ఇరాన్ అమాయకులను బలి చేసింది. అమెరికా 47వ అధ్యక్షుడిగా నేను వారిని అంతం చేస్తున్నాను. చరిత్రలో ఏ దేశమూ దెబ్బతిననంత తీవ్రంగా మేము వారిని(ఇరాన్) దెబ్బతీశాము. ఇంకా యుద్ధం పూర్తి కాలేదు. కొన్నేళ్లుగా ఇరాన్ ప్రపంచానికి కలిగిస్తున్న నష్టానికి ఇప్పుడు మూల్యం చెల్లించుకోబోతోంది. ఇరాన్ నుండి వచ్చే ఎలాంటి దాడికి నేను భయపడను' అని ట్రంప్ అన్నారు.


మరోవైపు తాజాగా అలీ ఖమేనీ కుమారుడు ప్రస్తుత సుప్రీం మెుజ్తాబా ఖమేనీ సైతం అమెరికా దాడుల్లో తీవ్రంగా గాయపడ్డారని ఊహగానాలు వచ్చాయి. ఈనేపథ్యంలో ఖమేనీ ఆరోగ్యంపై కూడా ట్రంప్ తొలిసారిగా స్పందించారు. ‘నాకు తెలిసి ఆయన గాయపడ్డాడు. ఏదో ఒక రూపంలో బతికే ఉన్నాడని అనుకుంటున్నాను’ అని అన్నారు. అయితే మెుజ్తాబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డట్లు కథనాలు పేర్కొంటున్నాయి. టెహ్రాన్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అతను ఓ కాలు పూర్తిగా కోల్పోయాడని సమాచారం.


ఇవీ చదవండి:

'మీరు శాంతిని కోరుకుంటే.. కూర్చుని మాట్లాడుకుంటే చాలు'

రష్యా చమురు కొనుగోలుకు అమెరికా గ్రీన్ సిగ్నల్

Updated Date - Mar 13 , 2026 | 03:14 PM