రష్యా రిఫైనరీపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి.. వంద అడుగుల ఎత్తుకు ఎగిరిన ట్యాంకు మూత..
ABN , Publish Date - Jun 18 , 2026 | 06:23 PM
రష్యా రాజధాని మాస్కో మరోసారి ఉక్రెయిన్ డ్రోన్ దాడులతో దద్దరిల్లింది. ఉక్రెయిన్ నిర్వహించిన భారీ డ్రోన్ దాడిలో మాస్కోలోని కీలక చమురు శుద్ధి కేంద్రం దెబ్బతింది.
ఇంటర్నెట్ డెస్క్: రష్యా రాజధాని మాస్కో మరోసారి ఉక్రెయిన్ డ్రోన్ దాడులతో దద్దరిల్లింది. ఉక్రెయిన్ నిర్వహించిన భారీ డ్రోన్ దాడిలో మాస్కోలోని కీలక చమురు శుద్ధి కేంద్రం దెబ్బతింది. అత్యంత ముఖ్యమైన ఇంధన శుద్ధి కేంద్రాలలో ఒకటి అయిన కపోట్న్యా ఆయిల్ రిఫైనరీపై ఉక్రెయిన్ డ్రోన్‌లు దాడి చేశాయి. ఆ దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి (Ukraine drone attack).
సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలలో, ఇంధన నిల్వ ట్యాంక్ వద్ద పేలుడు సంభవించడం కనబడుతోంది. ఆ తీవ్రతకు ట్యాంక్ పైకప్పు గాలిలోకి ఎగిరిపోయింది. ఆ తర్వాత రిఫైనరీ నుంచి మంటలు, నల్లటి పొగ పైకి లేవడం కనిపించింది. 'ఈ ఉదయం మాస్కో ఆయిల్ రిఫైనరీలోని ఒక ట్యాంక్‌ను ఉక్రేనియన్ డ్రోన్ ఢీకొట్టింది. ఆ ట్యాంక్ మూత వందల అడుగుల ఎత్తుకు ఎగిరిపడింది' అని సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్‌లో పేర్కొన్నారు (Moscow oil refinery blast).
గత రెండేళ్లలో మాస్కోపై ఉక్రెయిన్ చేసిన దాడులలో ఇదే పెద్దదని రష్యా అధికారులు పేర్కొన్నారు (Russia Ukraine war). మాస్కో వైపు వస్తున్న 194 డ్రోన్‌లను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయని, రష్యా వ్యాప్తంగా వందలాది డ్రోన్‌లను అడ్డుకున్నామని అధికారులు తెలిపారు. ఫ్రాన్స్‌లో జీ7 శిఖరాగ్ర సమావేశంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ సమావేశం తర్వాత ఈ డ్రోన్ దాడి జరగడం గమనార్హం.
ఇవి కూడా చదవండి..
మాస్కోపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి.. విమాన సర్వీసులకు అంతరాయం
ఈపీఎఫ్ చందాదారులకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఈ నెలలోనే వడ్డీ జమ..