ఇరాన్‌కు ఎదురుదెబ్బ.. దాడిలో నేవీ చీఫ్ మృతి..
ABN , Publish Date - Mar 26 , 2026 | 06:44 PM
ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ నేవీ చీఫ్ అలీరెజా తంగ్సిరిని ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు ఇజ్రాయెల్ ఓ ప్రకటన విడుదల చేసింది.
ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) నేవీ చీఫ్ అలీరెజా తంగ్సిరిని ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు ఇజ్రాయెల్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇరాన్ తీర ప్రాంత నగరమైన బందర్ అబ్బాస్‌పై జరిపిన దాడుల్లో అలీరెజాతో పాటు మరికొందరు సీనియర్ నౌకాదళ కమాండర్లు మృతి చెందినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే ఈ విషయంపై ఇరాన్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు (Alireza Tangsiri death news).
2018 నుంచి అలీరెజా ఐఆర్‌జీసీ నేవీ చీఫ్ పదవిలో కొనసాగుతున్నారు. హోర్ముజ్ జలసంధి మూసివేతను ఆయనే పర్యవేక్షిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇరాన్-అమెరికా మధ్య ఒకవైపు చర్చలు జరుగుతుండగానే మరోవైపు దాడులు కూడా కొనసాగుతున్నాయి. పశ్చిమాసియా దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగిస్తోంది. ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది (IRGC Navy chief killed).
తాజాగా ఇజ్రాయెల్‌లోని కెఫర్ ఖాసీం ప్రాంతంలో ఐదుగురు, టెల్ అవీవ్‌లో ఇద్దరు గాయపడ్డారు (Israel Iran conflict). ఇజ్రాయెల్ సైనిక నియంత్రణ కేంద్రం, అణు మౌలిక సదుపాయలకు సంబంధించిన పరిశ్రమలపై దాడులు చేశామని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రకటన చేసింది.
ఇవి కూడా చదవండి:
సంగక్కర రికార్డ్ బ్రేక్ చేసిన సౌతాఫ్రికా ప్లేయర్