Share News

అమెరికా దిగ్బంధనాన్ని ఎత్తివేయకపోతే.. గల్ఫ్ వాణిజ్యాన్ని స్థంభింపచేస్తాం: ఇరాన్

ABN , Publish Date - Apr 15 , 2026 | 09:05 PM

ఇరాన్ ఓడరేవులపై అమెరికా తన దిగ్బంధనాన్ని కొనసాగిస్తే గల్ఫ్ ప్రాంతంలో పూర్తిగా వాణిజ్యాన్ని స్థంభింపచేస్తామని ఇరాన్ హెచ్చరించింది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతం, ఒమన్ సముద్రం, ఎర్ర సముద్రం అంతటా ఎగుమతులు, దిగుమతులను పూర్తిగా నిలిపివేస్తామని ఇరాన్ పేర్కొంది.

అమెరికా దిగ్బంధనాన్ని ఎత్తివేయకపోతే.. గల్ఫ్ వాణిజ్యాన్ని స్థంభింపచేస్తాం: ఇరాన్
Iran Gulf trade threat

ఇరాన్ ఓడరేవులపై అమెరికా తన దిగ్బంధనాన్ని కొనసాగిస్తే గల్ఫ్ ప్రాంతంలో పూర్తిగా వాణిజ్యాన్ని స్థంభింపచేస్తామని ఇరాన్ హెచ్చరించింది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతం, ఒమన్ సముద్రం, ఎర్ర సముద్రం అంతటా ఎగుమతులు, దిగుమతులను పూర్తిగా నిలిపివేస్తామని ఇరాన్ సంయుక్త సైనిక దళాల కమాండర్ హెచ్చరించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రకటించింది. తన జాతీయ సార్వభౌమత్వాన్ని, ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఇరాన్ బలంగా వ్యవహరిస్తుందని పేర్కొంది (Iran Gulf trade threat).


ఫిబ్రవరిలో ఇజ్రాయెల్, అమెరికా దాడులు ప్రారంభించిన తర్వాత హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేసింది. ఇస్లామాబాద్‌‌లో జరిగిన శాంతి చర్చలు విఫలం కావడంతో ఇరాన్ ఓడరేవులను సోమవారం నుంచి అమెరికా దిగ్బంధించింది. ఇరాన్ ఓడరేవుల్లోకి ప్రవేశించడానికి, బయటకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్న నౌకలను అమెరికా అడ్డుకుంటోంది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరాన్ ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోయాయి (US Iran port blockade).


అమెరికా తన నావికా దిగ్బంధనాన్ని ఎత్తివేయకపోతే గల్ఫ్ ప్రాంతంలో వాణిజ్యాన్ని పూర్తిగా స్థంభించేస్తామని ఇరాన్ తాజాగా హెచ్చరించింది (Strait of Hormuz crisis). అమెరికా చర్యలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నట్టు ఉన్నాయని పేర్కొంది. కాగా, ఈ వారంలోనే ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్, అమెరికా ప్రతినిధుల మధ్య రెండో దఫా శాంతి చర్చలు మొదలు కాబోతున్నాయి. హోర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరవడం అనేది ఈ చర్చలో కీలకం కానుంది.


ఇవి కూడా చదవండి..

మాకు రూ.25 లక్షల కోట్లు చెల్లించండి.. అమెరికాతో చర్చలకు ముందు ఇరాన్ డిమాండ్..


ఇరాన్‌తో చర్చలు.. అమెరికా పెట్టిన రెండు షరతులు అవేనా..

Updated Date - Apr 15 , 2026 | 09:31 PM