భారత ప్రభుత్వంతో సత్సంబంధాలు.. నౌకల విషయంలో సంప్రదింపులు: ఇరాన్ రాయబారి
ABN , Publish Date - Apr 13 , 2026 | 08:18 PM
హోర్ముజ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు ప్రస్తుతం నౌకా రవాణాకు అంతరాయం కలిగిస్తున్నప్పటికీ, భారత నౌకలకు సురక్షిత ప్రయాణాన్ని కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని భారత్‌లోని ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాలీ పేర్కొన్నారు.
హోర్ముజ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు ప్రస్తుతం నౌకా రవాణాకు అంతరాయం కలిగిస్తున్నప్పటికీ, భారత నౌకలకు సురక్షిత ప్రయాణాన్ని కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని భారత్‌లోని ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాలీ పేర్కొన్నారు. భారత ప్రభుత్వంతో తాము సత్సంబంధాలు కలిగి ఉన్నామని అన్నారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో సముద్ర మార్గ రాకపోకలను సులభతరం చేయడానికి, మద్దతును అందించడానికి న్యూఢిల్లీతో టెహ్రాన్ సన్నిహితంగా పనిచేస్తోందని అన్నారు (India Iran relations 2026).
హోర్ముజ్ ప్రాంతంలో భారత్, ఇరాన్‌లకు ఉమ్మడి ప్రయోజనం, ఉమ్మడి భవిష్యత్తు ఉన్నాయని ఫతాలీ పునరుద్ఘాటించారు. తీవ్ర అనిశ్చితి నెలకొన్న ఈ సమయంలో ఇరు దేశాల మధ్య సమన్వయం గురించి ఆయన మాట్లాడారు. క్లిష్ట సమయంలో భారతదేశం తమకు అండగా నిలిచిందన్నారు. భారత దేశానికి, భారత పౌరులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. 'మాకు భారత ప్రభుత్వంతో మంచి సంబంధాలు ఉన్నాయి. భారత నౌకలకు ఇబ్బందులు కలగకూడదని మేము కోరుకుంటున్నాము' అన్నారు (Mohammad Fathali statement).
కాగా, ప్రస్తుతం హోర్ముజ్ జలసంధి వద్ద భారతదేశానికి రావాల్సిన 15 నౌకలు చిక్కుకుపోయినట్టు సమాచారం (Hormuz impact India oil). వీటిల్లో ఎల్‌ఎన్‌జీ, ఎల్పీజీ క్యారియర్లు, క్రూడాయిల్ ట్యాంకర్లతో పాటు ఓ కెమికల్ కంటైనర్ కూడా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. హోర్ముజ్ జలసంధిని పూర్తిగా దిగ్బంధిస్తామంటూ అమెరికా చేసిన ప్రకటనతో ఆ మార్గంలో నౌకల రాకపోకలు అకస్మాత్తుగా తగ్గినట్టు ట్రాకింగ్ నివేదకలు వెల్లడించాయి.
ఇవి కూడా చదవండి..
హోర్ముజ్ దిగ్బంధనం కొనసాగితే.. ముడి చమురు ధర 150 డాలర్లకు చేరుతుందా..
ఇరాన్ క్షిపణి దాడులు.. దెబ్బతిన్న అమెరికా ఫ్యూయల్ ట్యాంకర్ విమానం.. వీడియో వైరల్..