యుద్ధం గెలిచాక చమురు ధర గ్యాలన్ 2 డాలర్ల కంటే కిందకు: ట్రంప్
ABN , Publish Date - Sep 08 , 2026 | 09:49 PM
ఇరాన్‌తో యుద్ధం గెలిచిన వెంటనే అంతర్జాతీయంగా చమురు ధరలు గ్యాలన్‌కు 2 డాలర్ల కంటే దిగువకు చేరుకుంటాయని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
వాషింగ్టన్ డీసీ, సెప్టెంబర్ 8: ఇరాన్‌తో జరుగుతున్న సైనిక ఘర్షణలో అమెరికా విజయం సాధించిన వెంటనే అంతర్జాతీయంగా చమురు ధరలు విపరీతంగా పడిపోతాయని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో గ్యాసోలిన్ (పెట్రోల్) ధరలు గ్యాలన్‌కు 2 డాలర్ల కంటే దిగువకు చేరుకుంటాయని ఆయన జోస్యం చెప్పారు. తన 'ట్రూత్ సోషల్' (Truth Social) ప్లాట్‌ఫామ్‌లో ట్రంప్ ఈ మేరకు ఓ పోస్ట్ చేశారు.
ధరల పతనం ఖాయం: 'ఇరాన్‌తో యుద్ధంలో మనం విజయం సాధించిన వెంటనే మిగతా అన్ని ధరల్లాగే చమురు ధరలు కూడా వేగంగా కిందకు పడిపోతాయి. మొదట గ్యాలన్ $3కు, ఆ తర్వాత ఏకంగా $2 కంటే తక్కువకు చేరుకుంటుంది' అని ట్రంప్ పేర్కొన్నారు.
అణు అస్త్రం ఉండనివ్వం: ఇరాన్ దగ్గర ఎట్టిపరిస్థితుల్లోనూ అణు ఆయుధాలు లేకుండా చేస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. 'ఇదంతా చాలా వేగంగా జరుగుతుంది. ఇరాన్ ఎప్పటికీ అణు ఆయుధాన్ని కలిగి ఉండలేదు. MAGA!' అని ఆయన రాసుకొచ్చారు.

ఇరాన్ ప్రతీకార హెచ్చరికలు
మరోవైపు అమెరికా హెచ్చరికలపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాకర్ ఖాలిబాఫ్ తీవ్రంగా స్పందించారు. ఇరాన్ ఇంధన వనరులపై అమెరికా ఎలాంటి సాహసాలకు ఒడిగట్టినా తీవ్రమైన పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
యూఎస్ ఇంధన సంస్థలకు ముప్పు: ఇరాన్ చమురు, గ్యాస్ ఉత్పత్తి వ్యవస్థలు విశాలమైనవని, దాడికి అవకాశమున్న ప్రాంతాల్లో ఉన్నాయని చెప్పారు. అలాగే పర్షియన్ గల్ఫ్ పరిసర ప్రాంతాల్లోని అమెరికా చమురు, గ్యాస్ కంపెనీలకు కూడా అంతే ముప్పు ఉందని గుర్తుచేశారు.'మాపై దాడి చేస్తే.. మీపై దాడి తప్పదు' తమ ఆస్తులపై దాడి చేస్తే తిరిగి అమెరికా ఆస్తులను దెబ్బతీస్తామని, ఇప్పటికే పనికిరాకుండా పోయిన అమెరికా సైనిక స్థావరాలను చూస్తే తమ సామర్థ్యం ఏంటో అర్థమవుతుందని ఖాలిబాఫ్ హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి
వైసీపీకి బిగ్ షాక్.. బొత్స మేనల్లుడి రాజీనామా
రాగద్వేషాలకు అతీతంగా క్షేత్రస్థాయిలోని నాయకులు పనిచేయాలి: సీఎం చంద్రబాబు