Share News

చిన్నారిని భూమిలో పాతిపెట్టిన తండ్రి.. ఒక రోజు తరువాత సజీవంగా..

ABN , Publish Date - Nov 13 , 2026 | 10:24 AM

ఓ కర్కశ తండ్రి 11 నెలల చిన్నారిని బతికుండగానే భూమిలో పాతిపెట్టేశాడు. అయితే ఆ బాలుడు 24 గంటలు మృత్యువుతో పోరాడి..

చిన్నారిని భూమిలో పాతిపెట్టిన తండ్రి.. ఒక రోజు తరువాత సజీవంగా..

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలోని సౌత్ కరోలినా రాష్ట్రంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఓ కర్కశ తండ్రి 11 నెలల చిన్నారిని బతికుండగానే భూమిలో పాతిపెట్టేశాడు. అయితే ఆ బాలుడు 24 గంటలు మృత్యువుతో పోరాడి.. సురక్షితంగా బయటపడ్డాడు. భూమిలో పాతిపెట్టినా చిన్నారి 24 గంటల వరకూ సజీవంగా ఉండడం అక్కడి వారిని ఆశ్చర్యపరిచింది. వివరాల్లోకెళితే..


సౌత్ కరోలినాలో మైకేల్ కామర్ అనే వ్యక్తి 11 నెలల తన కుమారుడితో సహా అదృశ్యమయ్యాడు. దీంతో మైకేల్ భార్య కంగారు పడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అదృశ్యమైన ఇద్దరి కోసం గాలించడం మొదలు పెట్టారు. అనుమానంతో మైకేల్ నివాసం దగ్గర వెతికారు. ఆ ఇంటికి కొంచెం దూరంలో ఉన్న అటవీ ప్రాంతంలో తాజాగా గుంతను పూడ్చిన ఆనవాళ్లు పోలీసులకు కనిపించాయి. దీంతో వారు ఆ ప్రదేశంలో తవ్వి చూడగా.. అక్కడ చిన్నారి ఉన్నట్టు గుర్తించారు. తువాలులో చుట్టి, కుక్కల బోనులో పాతిపెట్టిన ఆ బాలుడిని బయటకు తీశారు. అయితే అప్పుడే ఆ చిన్నారి ఏడుపు అందుకున్నాడు. అది చూసిన పోలీసులు షాక్ అయ్యారు. భూమిలోపల ఉన్నా కూడా 24 గంటల సేపు పసికందు సజీవంగా ఉండడం వారిని ఆశ్చర్యపరిచింది. వెంటనే పోలీసులు ఆ మృత్యుంజయుణ్ని ఆసుపత్రికి తరలించారు. కాగా తన కుమారుణ్ని తండ్రి మైకేల్ కామరే పాతిపెట్టినట్టు వారు తెలిపారు.


ఈ వార్తలూ చదవండి

గొడ్రాలంటూ వేధిస్తున్న భర్తను హతమార్చిన భార్య.. బెంగళూరులో ఘటన

ప్రేమ వివాహం చేసుకుంటానన్న కూతురు.. చున్నీతో ఉరేసి చంపిన తండ్రి..

Updated Date - Nov 13 , 2026 | 10:39 AM