ఎన్విడియా సీఈఓపై మేము గూఢచర్యం చేయలేదు: చైనా
ABN , Publish Date - Nov 09 , 2026 | 05:45 PM
ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌పై తాము గూఢచర్యం చేశామన్న ఆరోపణలను చైనా ఖండించింది. అవన్నీ నిరాధార ఆరోపణలని, తమపై బురదజల్లే ప్రయత్నంలో భాగంగానే అలాంటి దుష్ర్పచారం చేస్తున్నారని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గువో జియాకున్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌పై తాము గూఢచర్యం చేశామన్న ఆరోపణలను చైనా ఖండించింది. అవన్నీ నిరాధార ఆరోపణలని, తమపై బురదజల్లే ప్రయత్నంలో భాగంగానే అలాంటి దుష్ర్పచారం చేస్తున్నారని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గువో జియాకున్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అమెరికా పత్రిక ద న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన ఓ కథనం ఈ వివాదానికి కారణమైంది. చైనా పౌరురాలు, వ్యాపారవేత్త ఆలిస్ హువాంగ్‌తో జెన్సన్ హువాంగ్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, బీజింగ్‌కు ఆమె నిఘా సమాచారాన్ని అందించే వ్యక్తి అయి ఉండొచ్చని ఆ కథనంలో పేర్కొంది.
ఈ నేపథ్యంలో జెన్సన్ హువాంగ్ స్పందించారు. తన భార్యకు ద్రోహం చేశానని ఆయన అంగీకరించారు. ఇందుకు తన భార్యాపిల్లలకు ఆయన క్షమాపణలు చెప్పారు. తాను చేసిన తప్పును సమర్థించుకోవడం లేదని సంస్థ ఉద్యోగులకు ఒక సందేశం పంపారు. తాను చేసిన పని కారణంగా తన భార్యాపిల్లలు బాధపడ్డారని విచారం వ్యక్తం చేశారు. మరోవైపు ఈ వ్యవహారంపై ఎన్విడియా స్పందించింది. ఆ ఆరోపణలపై దర్యాప్తు చేపడతామని వెల్లడించింది. ఈ పరిణామాల నేపథ్యంలో సోమవారం ప్రీ-మార్కెట్ ట్రేడింగ్‌లో ఎన్విడియా షేర్లు దాదాపు 5 శాతం పడిపోయాయి.
చైనాకు చిప్‌ల విక్రయాల కోసం హువాంగ్ ఒత్తిడి
చైనాకు చిప్‌ల విక్రయాలపై అమెరికా ఆంక్షలను సడలించాలని జెన్సన్ హువాంగ్ గత కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నారని అసోసియేటెడ్ ప్రెస్ (ఏపీ) వెల్లడించింది. ఈ ఏడాది హెచ్ 200 చిప్‌లను చైనాకు విక్రయించేందుకు అనుమతించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఆయన ఒత్తిడి తెచ్చారని పేర్కొంది. అయితే ఈ చిప్‌లను తమ కంపెనీలు పెద్ద మొత్తంలో కొనుగోలు చేసేందుకు చైనా ప్రభుత్వం అనుమతిస్తుందా లేదా అన్నది ఇంకా స్పష్టత లేదు. చైనా ప్రభుత్వ ఆంక్షల కారణంగా ఆ దేశానికి పరిమిత స్థాయిలోనే చిప్‌లను విక్రయించామని ఎన్విడియా ఈ ఏడాది ఆగస్టులో ఒక నివేదికలో పేర్కొంది. కాగా.. ఈ వివాదంపై చైనా మీడియా హువాంగ్ వ్యక్తిగత సంబంధాల అంశాన్నే ప్రస్తావిస్తోంది. అమెరికా-చైనా సంబంధాలను దెబ్బతీసే ఉద్దేశంతోనే న్యూయార్క్ టైమ్స్ ఆ కథనాన్ని ప్రచురించిందని కొన్ని మీడియా సంస్థలు వ్యాఖ్యానించాయి. ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్న ప్రతిసారీ కొందరు కుట్రపూరితంగా దుష్ప్రచారాలకు పాల్పడుతున్నారని చైనా ప్రభుత్వానికి చెందిన గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.
ఇవీ చదవండి:
నా భార్యకు ద్రోహం చేశా.. క్షమించండి: ఎన్విడియా సీఈఓ
ఇరాన్‌పై మళ్లీ యుద్ధం.. అత్యంత అసంభవం: ట్రంప్