Share News

టైటానిక్‌ను మించిన భారీ నౌక.. ఇప్పుడు సముద్రగర్భంలోకి..

ABN , Publish Date - Nov 09 , 2026 | 09:52 AM

దాదాపు 1,000 అడుగులు ఉండే ఆ నౌక.. టైటానిక్ కంటే పెద్దది. 1950లో సుమారు 70 మిలియన్ డాలర్ల వ్యయంతో అది తయారైంది.

టైటానిక్‌ను మించిన భారీ నౌక.. ఇప్పుడు సముద్రగర్భంలోకి..

ఇంటర్నెట్ డెస్క్: దాదాపు 1,000 అడుగులు ఉండే ఆ నౌక.. టైటానిక్ కంటే పెద్దది. 1950లో సుమారు 70 మిలియన్ డాలర్ల వ్యయంతో అది తయారైంది. అప్పట్లో ఏకంగా 14,000 మంది సైనికులను ఒకేసారి దాని ద్వారా తరలించేవారు. అయితే అలాంటి నౌకను ఇప్పుడు సముద్రంలో ముంచేయనున్నారు. సముద్రగర్భంలో దాన్ని ఆర్టిఫిషియల్ రీఫ్ (కృత్రిమ పగడపు దిబ్బ)గా మార్చనున్నారు. అమెరికాకు చెందిన ‘ఎస్‌ఎస్‌ యునైటెడ్‌ స్టేట్స్‌’ నౌక గురించీ కథనం. ఇదివరకు ఈ ‘ఎస్‌ఎస్‌ యునైటెడ్‌ స్టేట్స్‌’ సముద్రయానంలో ప్రపంచ రికార్డులు నెలకొల్పింది. 1969 వరకు దీన్ని వినియోగించిన అగ్రరాజ్యం.. ఆ తరువాత ప్రైవేటు వ్యక్తులకు విక్రయించింది. సుమారు 30 ఏళ్ల పాటు ఈ నౌక ఫిలడెల్పియా షిప్‌యార్డ్‌లోనే ఉంది. ఇటీవల దీన్ని ఒకలూసా కౌంటీ మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది.


ఇప్పుడు ‘ఎస్‌ఎస్‌ యునైటెడ్‌ స్టేట్స్‌’ను ఆర్టిఫిషియల్ రీఫ్‌గా తయారు చేసేందుకు ‘ఒకలూసా’ సిద్ధమైంది. ఇందుకోసం నౌకను అమెరికా ఫ్లోరిడాలోని డెస్టిన్-ఫోర్ట్ వాల్టన్ బీచ్‌కు 40 కిలోమీటర్ల దూరంలోని సముద్రంలో ముంచనుంది. అలాగే ఫ్లోరిడా తీరంలో ఓ ప్రత్యేక మ్యూజియాన్నీ ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా చేపల వేట, డైవింగ్ వంటి పర్యాటక రంగాలు అభివృద్ధి చెందనున్నాయి. కాగా ‘ఎస్‌ఎస్‌ యునైటెడ్‌ స్టేట్స్‌’ పేరిట అనేక రికార్డులు ఉన్నాయి. ఈ నౌక తన తొలి ప్రయాణంలోనే న్యూయార్క్ నుంచి ఐరోపాకు కేవలం మూడు రోజుల 11 గంటల్లో చేరుకుంది.


ఇవీ చదవండి

సెనెగల్ తీరంలో ఘోర పడవ ప్రమాదం.. 21 మంది మృతి

మన ప్రజల సొమ్ము పాక్‌కు ఎందుకు ఇవ్వాలి: యూఎస్ సెనేటర్

Updated Date - Nov 09 , 2026 | 10:27 AM