Share News

భయపడొద్దు.. మనం మళ్లీ పుంజుకుంటాం: ట్రంప్

ABN , Publish Date - Nov 08 , 2026 | 08:53 PM

మిడ్‌టర్మ్ ఎన్నికల ఫలితాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఫలితాలను అమెరికా చరిత్రలో భారీ తిరోగమనంగా అభివర్ణించారు.

భయపడొద్దు.. మనం మళ్లీ పుంజుకుంటాం: ట్రంప్
Donald Trump

ఇంటర్నెట్ డెస్క్: మిడ్‌టర్మ్ ఎన్నికల ఫలితాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఫలితాలను అమెరికా చరిత్రలో భారీ తిరోగమనంగా అభివర్ణించారు. ఎన్నికల్లో అధికార రిపబ్లికన్లు ఘోర ఓటమి ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ప్రతిపక్ష డెమోక్రాట్లు ఉభయ సభల్లోనూ పైచేయి సాధించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు.

మిడ్‌టర్మ్ ఎన్నికల మునుపు అమెరికా స్టాక్ మార్కెట్ రాకెట్ స్పీడుతో దూసుకుపోయిందని ట్రంప్ తన పోస్టులో చెప్పుకొచ్చారు. ఫలితాలు వెలువడిన రోజునే 3 ట్రిలియన్ డాలర్లు తుడిచిపెట్టుకుపోయాయని చెప్పారు. ‘అయినా భయపడొద్దు. మనం మళ్లీ పుంజుకుంటాము. గతంలో కంటే శక్తిమంతంగా మారుతాము’ అని ట్రంప్ తన పోస్టులో రాసుకొచ్చారు.


ఎన్నికల ఫలితాలపై గతంలో కూడా స్పందించిన ట్రంప్ ఇవి తన పాలనపై రెఫరెండం కాదని చెప్పుకునే ప్రయత్నం చేశారు. బాలెట్ పేపర్లపై తన పేరు కనిపించి ఉంటే ఫలితం మరోలా ఉండేదని చెప్పారు. ఇరాన్ యుద్ధం వల్ల మిడ్‌టర్మ్ ఎన్నికల్లో ఓటమి ఎదురైందని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఫలితాల అనంతరం చెప్పారు. తమ పార్టీ వాళ్లే కొందరు ప్రత్యర్థులకు ఓటేశారని కూడా అన్నారు. ఎన్నికల మునుపు జరిగిన సర్వేల్లో రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులు పాలనలో మార్పులు రావాలని అభిప్రాయపడ్డ వైనం తన దృష్టికి వచ్చిందని చెప్పారు.


ఈ వార్తలనూ చదవండి:

ప్రభుత్వ ఏర్పాటులో సందిగ్ధం.. ఇజ్రాయెల్‌లో పతాకస్థాయికి ఉత్కంఠ!

సౌదీపై హూతీల దాడులు.. ఆరాంకో చమురు కేంద్రాలు, రియాద్ విమానాశ్రయమే లక్ష్యం..

Updated Date - Nov 08 , 2026 | 09:18 PM