Denmark Warns US: అమెరికాకు డెన్మార్క్ హెచ్చరిక.. వస్తే కాల్చి పడేస్తాం..
ABN , Publish Date - Jan 09 , 2026 | 09:08 AM
గ్రీన్‌లాండ్ పొరుగు దేశం డెన్మార్క్ అప్రమత్తమైంది. అమెరికా తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. గ్రీన్‌లాండ్ జోలికి వస్తే చూస్తూ ఉరుకోమంటూ గట్టి వార్నింగ్ కూడా ఇచ్చింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పొరుగు దేశాలను టార్గెట్ చేశారు. జాతీయ భద్రత పేరుతో దేశాలను స్వాధీనం చేసుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే వెనెజువెలా దేశ అధ్యక్షుడు మదురోను, ఆయన భార్యను అమెరికా అరెస్ట్ చేసింది. ఇప్పుడు గ్రీన్‌ల్యాండ్‌ను ట్రంప్ టార్గెట్ చేశారు. ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రీన్‌లాండ్ పొరుగు దేశం డెన్మార్క్ అప్రమత్తమైంది. అమెరికా తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. గ్రీన్‌లాండ్ జోలికి వస్తే చూస్తూ ఉరుకోమంటూ గట్టి వార్నింగ్ కూడా ఇచ్చింది.
డానిష్ డిఫెన్స్ మినిస్ట్రీ మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ‘అమెరికా గనుక గ్రీన్‌లాండ్‌లోకి చొరబడితే సైనికులు ముందు కాల్పులు జరపాలి. తర్వాత ప్రశ్నలు అడగాలి. 1952 ఆర్మీ రూల్ ప్రకారం ఉన్నతాధికారుల ఆదేశాల కోసం ఎదురు చూడకుండానే సైనికులు చొరబాటుదారులపై దాడి చేయవచ్చు. ఆ రూల్ ఇంకా అమల్లోనే ఉంది’ అని స్పష్టం చేసింది. ఇక, అమెరికా తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా పొరుగు దేశాలకు కంటిమీద కునుకు లేకుండా పోయింది.
వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ మీడియాతో మాట్లాడుతూ.. ‘అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా స్పష్టంగా చెప్పారు. గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవటం అన్నది జాతీయ భద్రతకు సంబంధించిన విషయం. అధ్యక్షుడు, ఆయన టీం గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవటంపై చర్చలు జరుపుతున్నారు’ అని పేర్కొన్నారు. యూఎస్ సెక్రటరీ ఆప్ స్టేట్ మార్కో రూబియో మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను వచ్చే వారం డానిష్, గ్రీన్‌లాండ్ అధికారులతో మాట్లాడటానికి ప్లాన్ చేస్తున్నా. అధ్యక్షుడు ట్రంప్ గ్రీన్‌లాండ్‌ను కొనుక్కోవాలని అనుకుంటున్నారు. మిలిటరీని ఉపయోగించి స్వాధీనం చేసుకోవాలని అనుకోవటం లేదు’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
ఎమ్మెల్యే సంచలన కామెంట్స్.. అస్థిత్వాన్ని దెబ్బ తీసేందుకు కాంగ్రెస్ కుట్ర
పిల్లాడి వెంటపడ్డ వీధి కుక్కలు.. తర్వాత ఏం జరిగిందంటే..