Boy Narrowly Escapes: పిల్లాడి వెంటపడ్డ వీధి కుక్కలు.. తర్వాత ఏం జరిగిందంటే..
ABN , Publish Date - Jan 09 , 2026 | 07:49 AM
ఓ స్కూలు విద్యార్థి వీధి కుక్కల దాడి నుంచి తృటిలో తప్పించుకున్నాడు. దాదాపు ఆరు కుక్కలు అతడ్ని వెంబడించి దాడి చేయడానికి ప్రయత్నించాయి. బాలుడు వేగంగా అక్కడినుంచి తప్పించుకున్నాడు..
ఈ మధ్య కాలంలో వీధి కుక్కలు మనుషులపై దాడులు చేస్తున్న సంఘటనలు పెరిగిపోతున్నాయి. చిన్న పిల్లల దగ్గరి నుంచి ముసలివారి వరకు వీధి కుక్కల దాడుల్లో గాయపడుతున్నారు. తాజాగా, ఓ స్కూలు విద్యార్థి వీధి కుక్కల దాడి నుంచి తృటిలో తప్పించుకున్నాడు. దాదాపు ఆరు కుక్కలు అతడ్ని వెంబడించాయి. దాడి చేయడానికి ప్రయత్నించాయి. బాలుడు వేగంగా అక్కడినుంచి తప్పించుకున్నాడు. లేదంటే బాలుడి ప్రాణాలు పోయేవి. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. గ్వాలియర్‌కు చెందిన ఓ బాలుడు స్కూలు నుంచి ఇంటికి తిరిగి వస్తున్నాడు. అతడు శతాబ్ది కాలనీలోకి రాగానే దాదాపు 6 కుక్కలు వెంటపడ్డాయి. బాలుడు ప్రాణ భయంతో అక్కడినుంచి పరుగులు తీశాడు. వెనక్కు తిరిగి చూడకుండా పరిగెత్తాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత కుక్కలు బాలుడి వెంటపడటం ఆపేసి.. వెనక్కు వెళ్లిపోయాయి. దీంతో బాలుడు తప్పించుకున్నాడు. లేదంటే అతడి ప్రాణాలు పోయి ఉండేవి.
ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఆ వీడియో కాస్త వైరల్‌గా మారింది. ఆ వీడియోలో కుక్కలు బాలుడి వెంటపడుతున్న దృశ్యాలు ఉన్నాయి. ఇక, ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఈ మధ్య వీధి కుక్కల దాడులు బాగా పెరిగిపోయాయి. రోడ్ల మీద తిరగాలంటే భయపడాల్సి వస్తోంది’..‘కొంచెం ఉంటే ఆ బాలుడి ప్రాణాలు పోయేవి. చాలా వేగంగా పరిగెత్తి తప్పించుకున్నాడు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ విభజనపై కసరత్తు
బంగారం కొనాలనుకునే వారికి గుడ్‌న్యూస్.. తగ్గుతున్న ధరలు..