Gold Price Update: బంగారం కొనాలనుకునే వారికి గుడ్‌న్యూస్.. తగ్గుతున్న ధరలు..
ABN , Publish Date - Jan 09 , 2026 | 07:18 AM
10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,37,990 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.1,26,500 వద్ద ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,03, 500 దగ్గర ట్రేడ్ అవుతోంది.
బంగారం అంటే ఇష్టపడని భారతీయుడు ఉండడంటే అతిశయోక్తికాదు. భారత్‌లో నూటికి 90 శాతం శుభకార్యాలలో బంగారం తప్పని సరి. ఏడాది క్రితం లక్ష రూపాయలకు దిగువన ఉన్న బంగారం ధరలు ఊహించని స్థాయిలో పెరిగాయి. ప్రస్తుతం స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,30,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. రోజురోజుకూ పెరిగిపోతున్న బంగారం ధరలతో ఇబ్బంది పడుతున్న వారికి ఇది గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. వారం రోజుల క్రితం వరకు పరుగులు పెట్టిన బంగారం ధరలు.. రెండు రోజుల నుంచి తగ్గుతూ వస్తున్నాయి. పేద, మధ్య తరగతి కుటుంబాల వారికి భారీ ఊరటను ఇస్తున్నాయి.
ఈ రోజు బంగారం ధరలు ఇలా..
ఈ రోజు (శుక్రవారం) బంగారం ధరల విషయానికి వస్తే.. పది గ్రాముల 24, 22,18 క్యారెట్ల బంగారంపై రూ.10లు తగ్గింది. ప్రస్తుతం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,37,990 దగ్గర ట్రేడ్ అవుతోంది. పది గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.1,26,500 దగ్గర ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,03,500 వద్ద ట్రేడ్ అవుతోంది.
వెండి ధరలు ఇలా..
పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి వెండి బెస్ట్ ఆప్షన్ అని స్టాక్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే గత రెండు రోజుల నుంచి వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. నిన్న కిలో వెండి ధర రూ.2,72,000 వద్ద ట్రేడ్ అయింది. 100 గ్రాముల వెండి ధర రూ.27,200 గా ఉంది. నేడు కిలోపై రూ.100, 100 గ్రాములపై రూ.10 మేర తగ్గింది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.2,71,900 వద్ద, 100 గ్రాముల వెండి ధర రూ.27,190 వద్ద ట్రేడ్ అయింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (24 క్యారెట్లు ఒక గ్రాముకు.. అంచనా)
హైదరాబాద్ రూ. 13,977
విజయవాడ రూ. 13,977
ఢిల్లీ రూ. 13,977
ముంబై రూ. 13,995
వడోదర రూ. 13,995
కోల్‌కతా రూ. 13,890
చెన్నై రూ. 14,000
బెంగళూరు రూ. 13,880
కేరళ రూ. 14,000
పుణే రూ. 13,900
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
ఇవి కూడా చదవండి..
ఆ ఏరియా వాసులకు బిగ్ అలెర్ట్.. 10న కృష్ణా జలాలు బంద్
ఆ తప్పిదమే మా ఓటమికి కారణమైంది: బెన్ స్టోక్స్