Share News

Krishna waters: ఆ ఏరియా వాసులకు బిగ్ అలెర్ట్.. 10న కృష్ణా జలాలు బంద్‌

ABN , Publish Date - Jan 09 , 2026 | 06:51 AM

హైదరాబాద్ మహానగరంలోని ఆయా ఏరియాలకు సరఫరా అవుతున్న కృష్ణా జలాలు శనివారం నిలిపివేస్తున్నారు. పైపులైన్‌ మరమ్మతు పనులు, ఇతర కారాణాల వల్ల తాగునీటిని నిలిపివేస్తున్నట్లు అధికారు తెలిపారు.

Krishna waters: ఆ ఏరియా వాసులకు బిగ్ అలెర్ట్.. 10న కృష్ణా జలాలు బంద్‌

- పలు ప్రాంతాలకు తాగునీటి సరఫరాలో అంతరాయం

హైదరాబాద్‌ సిటీ: నగరానికి సరఫరా అవుతున్న రెండో దశ కృష్ణా జలాలు(Krishna waters) 36 గంటల పాటు నిలిచిపోనున్నాయి. శనివారం ఉదయం ఆరు గంటల నుంచి ఆదివారం సాయంత్రం ఆరు గంటల వరకు నిలిపివేసి పైపులైన్‌లో పలు మరమ్మతు పనులు చేపట్టనున్నారు. మహా నగరానికి నీరు సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్‌ వాటర్‌ సప్లయ్‌ స్కీమ్‌ ఫేజ్‌-2లోని కోదండాపూర్‌(Kondapur) నుంచి గొడకండ్ల వరకు ఉన్న పంపింగ్‌ మెయిన్‌పై 200 మిమీ డయా ఎంఎస్‏పై ఏర్పడిన లీకేజీని అరికట్టడం,


దెబ్బతిన్న 2375 మి.మీ డయా ఎంఎస్‌ ఎయిర్‌ టీలు, వాల్వ్‌లను మార్పిడి చేయడం, నసర్లపల్లి వద్ద జంక్షన్‌ పనులు చేపట్టడం, వివిధ ప్రాంతాల్లో దెబ్బతిన్న బటర్‌ఫ్లై వాల్వ్‌లు, ఎన్‌ఆర్‌వీలను మార్పిడి చేయడం వంటి పనులు చేపట్టాల్సి వుంది. ఈ పనుల నేపథ్యంలో రెండో దశలో కృష్ణా జలాలను శనివారం ఉదయం ఆరు గంటల నుంచి 36 గంటల పాటు బంద్‌ చేయనున్నారు.


city1.jpg

ఈ ప్రాంతాల్లో అంతరాయం...

వనస్థలిపురం(Vanasthalipuram), ఆటోనగర్‌, వైశాలీనగర్‌, నాగోల్‌, బడంగ్‌పేట్‌, లెనిన్‌ నగర్‌, ఆదిభట్ల, కమ్మగూడ, బాలాపూర్‌, బర్కాస్‌, మైసారం, యెల్లుగుట్ట, నాచారం, తార్నాక, బౌద్థనగర్‌, నల్లగుట్ట, లాలాపేట, మారేడుపల్లి, ప్రకా్‌షనగర్‌, పాటిగడ్డ, మేకలమండి, మహేంద్రహిల్స్‌, ఎంఈఎస్‌, రైల్వేలు, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డు, హస్మత్‌పేట్‌, గౌతమ్‌నగర్‌, ఫిరోజ్‌గూడ, మధుబన్‌, శాస్ర్తిపురం, ప్రశాసన్‌నగర్‌, నేషనల్‌ పోలీస్‌ అకాడమీ.


ఈ వార్తలు కూడా చదవండి.

ఇక షోరూం వద్దే వాహన రిజిస్ట్రేషన్‌

శాప్‌కు 60.76 కోట్లు.. కేంద్ర క్రీడా శాఖ కేటాయింపు

Read Latest Telangana News and National News

Updated Date - Jan 09 , 2026 | 06:51 AM